నెలాఖరు కల్లా.. 28 e-బస్సులు
నగరంలో ఈ నెలాఖరు వరకు ఆర్టీసీ ఎలక్ట్రిక్ బస్సులను తిప్పనుంది. ఇప్పటికే నగరానికి చేరుకున్న బస్సులు తుది మెరుగులు దిద్దుకునే దశలో ఉన్నాయి.
- మొదట కంటోన్మెంట్ డిపో నుంచి…
- సిద్ధమవుతున్న ఛార్జింగ్ పాయింట్లు
- ఆర్టీసీకి తగ్గనున్న నిర్వహణ వ్యయం
సిటీబ్యూరో, జూన్ 13 (నమస్తే తెలంగాణ): నగరంలో ఈ నెలాఖరు వరకు ఆర్టీసీ ఎలక్ట్రిక్ బస్సులను తిప్పనుంది. ఇప్పటికే నగరానికి చేరుకున్న బస్సులు తుది మెరుగులు దిద్దుకునే దశలో ఉన్నాయి. ఎలక్ట్రిక్ బస్సులకు కావాల్సిన చార్జింగ్ పాయింట్లను కంటోన్మెంట్, మియాపూర్ డిపోల ఆధ్వర్యంలో ఏర్పాటు చేస్తున్నారు. కంటోన్మెంట్ డిపోకు తొలి విడుతగా 28 ఎలక్ట్రిక్ బస్సులు చేరుకుంటాయని, ఇందుకు సంబంధించిన ఏర్పాట్లు కూడా పూర్తి చేశామని ఆర్టీసీ అధికారులు తెలిపారు.
ఈ బస్సులను తొలుత సికింద్రాబాద్ నుంచి జూబ్లీహిల్స్ చెక్‌పోస్టు మీదుగా.. మణికొండ, జేబీఎస్ నుంచి వయా ఉప్పల్ ఎక్స్‌రోడ్ మీదుగా ఇబ్రహీంపట్నం వరకు, సికింద్రాబాద్ నుంచి వయా రామ్‌నగర్ మీదుగా దిల్‌సుఖ్‌నగర్‌కు రూట్‌మ్యాప్ సిద్ధం చేశారు. ఆయా మార్గాల్లో ప్రయాణికుల రద్ధీ ఎక్కువగా ఉంటుందని, అందువల్ల తొలుత ఈ మూడు మార్గాల్లో బస్సులు నడిపించనున్నట్లు ఆర్టీసీ అధికారులు పేర్కొన్నారు. మరో రెండు నెలల్లో మియాపూర్ డిపో నుంచి మరో 36 ఎలక్ట్రిక్ బస్సులను ప్రారంభించనున్నారు.
తగ్గనున్న నిర్వహణ వ్యయం..
నగర రోడ్లపై ఎలక్ట్రిక్ బస్సులను నడిపించడం వల్ల ప్రతి కిలోమీటర్‌పై ఖర్చు బాగా తగ్గుతుంది. ప్రస్తుతం ఒక కిలోమీటర్‌కు డీజిల్ ఖర్చు రూ.18 అవుతున్నది. అదే ఎలక్ట్రిక్ బస్సుకు ప్రతి కిలోమీటర్‌కు అయ్యే చార్జింగ్ ఖర్చు రూ.6 అవుతుందని అధికారులు తెలిపారు. దీంతో ప్రతి కిలోమీటర్‌పై దాదాపు రూ.12 వరకు ఆర్టీసీకి ఆదా అయ్యే అవకాశాలు ఉన్నాయి. దీని వల్ల ఆర్టీసీకి నిర్వహణ వ్యయం తగ్గి ఆదాయం పెరిగే అవకాశం ఉంది.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Destiny | నందినీ రెడ్డి చేతుల మీదుగా ‘డెస్టినీ’ ఫస్ట్ లుక్ లాంచ్.. ఇంట్రెస్టింగ్గా ఇమ్మాన్యుయేల్ లుక్!
శ్రీ రామలింగేశ్వర లిఫ్ట్ ఇరిగేషన్‌ను సత్వరమే పూర్తి చేయాలి : మాజీ ఎమ్మెల్యే నోముల భగత్ కుమార్
KTR | సహకార సంఘాల బలోపేతానికి బీఆర్ఎస్ సహకారం : కేటీఆర్
Plague Disease | ప్లేగు వ్యాధిలో అసలు ఎన్ని రకాలు ఉన్నాయి.. ఈ వ్యాధి ఎలా వస్తుంది..?
PM Modi | కెనడాలో పర్యటించనున్న ప్రధాని మోదీ.. డిసెంబర్ 11, 12 తేదీల్లో షెడ్యూల్ ఖరారు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

