RTC Driver | హైదరాబాద్‌లో ఓ ఆర్టీసీ బస్సు డ్రైవర్ ఆకస్మికంగా మరణించాడు. కాలికి గాయమైందని ఆస్పత్రిలో చేరిన డ్రైవర్‌కు.. మూడు రోజుల చికిత్స అందించిన అనంతరం ఇవాళ అతను మరణించాడని వైద్యులు తెలిపారు. దీనిపై మృతుడి కుటుంబసభ్యులు, తోటి ఉద్యోగులు పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. వైద్యుల నిర్లక్ష్యం కారణంగానే సతీశ్ ప్రాణాలు కోల్పోయాడని ఆరోపిస్తున్నారు.
హైదరాబాద్‌లోని పంజాగుట్టకు చెందిన సతీశ్ టీజీఎస్ఆర్టీసీలో బస్సు డ్రైవర్‌గా పనిచేస్తున్నారు. నవంబర్ 30వ తేదీన జరిగిన ప్రమాదంలో సతీశ్ కాలికి గాయమైంది. దీంతో సతీశ్‌ను తార్నాకలోని ఆస్పత్రిలో చేర్పించారు. అక్కడ సతీశ్ కాలికి సిమెంట్ పట్టి వేసి చికిత్స అందించారు. ఈ క్రమంలో నిన్న మధ్యాహ్నం 3 గంటల ప్రాంతంలో అకస్మాత్తుగా సతీశ్ చనిపోయాడని ఆస్పత్రి వైద్యులు వెల్లడించారు. దీనిపై సతీశ్ కుటుంబసభ్యులు, తోటి ఉద్యోగులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఉదయం 10 గంటలకు డాక్టర్లు అన్ని పరీక్షలు చేసి ఎలాంటి సమస్య లేదని ఆపరేషన్ థియేటర్లోకి తీసుకెళ్లారని, మధ్యాహ్నం 3 గంటల వరకు ఎన్ని సార్లు అడిగినా సమాధానం ఇవ్వలేదని కుటుంబసభ్యులు, తోటి కార్మికులు ఆరోపించారు. ఎందుకు ఎలాంటి సమాచారం ఇవ్వడం లేదని నిలదీయడంతో సతీశ్ చనిపోయాడని డాక్టర్లు చెప్పారని పేర్కొన్నారు. ఎలాంటి అనుభవం లేని డాక్టర్లతో ఆపరేషన్ చేయించడం వల్లనే సతీశ్ మృతిచెందాడని వారు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం, టీజీఎస్ ఆర్టీసీ ఆస్పత్రి యాజమాన్యంపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్‌చేశారు.
కాలికి గాయమయిందని ఆర్టీసీ ఆసుపత్రిలో చేరిన ఆర్టీసీ బస్సు డ్రైవర్
మూడు రోజుల చికిత్స అనంతరం మృతి చెందినట్లు తెలిపిన వైద్యులు.. వైద్యుల నిర్లక్ష్యం కారణంగానే మృతి చెందాడని కుటుంబ సభ్యుల నిరసన
హైదరాబాద్ – పంజాగుట్టలో నివాసం ఉంటూ తెలంగాణ ఆర్టీసీ బస్సు డ్రైవర్‌గా పని చేస్తున్న… pic.twitter.com/rMG1uZAXaU
— Telugu Scribe (@TeluguScribe) December 5, 2025