శంషాబాద్ రూరల్, మే 21 ః ఆర్టీసీ బస్సు ఢీకొని లారీ డ్రైవర్ మృతి చెందిన ఘటన గురువారం శంషాబాద్ రూరల్ పోలీస్‌స్టేషన్ పరిధిలో జరిగింది. సీఐ నరేందర్‌రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం తమిళనాడుకు చెందిన రామ్‌కుమార్ మురుగన్(43) ఏపీలోని కర్నూల్లో నివాసముంటూ డ్రైవర్‌గా పని చేస్తున్నాడు.
ఈ నెల 14న రాత్రి 8.30 సమయంలో కేఏ 51ఏఏ0667 నంబర్‌గల లారీలో కవర్స్లోడ్ నింపుకొని రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలంలోని గండిగూడ వద్దకు 17 తేదీకి చేరుకున్నాడు.ఇక్కడే ఉన్న లారీ డ్రైవర్ రాత్రి 11.30 గంటల సమయంలో రోడ్డు దాటుతుండగా హైదరాబాద్ వైపు వస్తున్న ఏపీ 39 జడ్ 0882 నంబర్ గల ఆర్టీసీ బస్సు ఢీకొట్టడంతో తీవ్ర గాయాలైన రామ్‌కుమార్ మురుగన్ అక్కడిక్కడే మృతి చెందారు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.