తిరుగు ప్రయాణమూ భారమే
(నమస్తే తెలంగాణ): పండుగకు ఊరెళ్లిన వారి నగర తిరుగు ప్రయాణాలు సైతం ఖరీదుగానే మారాయి. సంతోషంతో పండుగకు ఊరెళ్లాలనుకున్న వారిపై ప్రభుత్వం చార్జీల భారం మోపిన విషయం తెలిసిందే. 50 శాతం అదనపు చార్జీలు వసూ లు చేసి పండుగ మురిపెం లేకుండా చేసింది. ఆ చార్జీలకు భయపడి కొన్ని కుటుంబాలు ప్రయాణాలు సైతం వాయిదా వేసుకున్న సంఘటనలు ఉన్నాయి. ఇప్పుడు ఊరెళ్లిన వారు నగరానికి చేరుకోవడానికి సైతం చార్జీల మోత వెంటాడుతున్నది. మంగళవారం అర్ధరాత్రి నుంచే నగరానికి తిరుగు ప్రయాణాలు మొదలయ్యాయి
- ఆర్టీసీ, ప్రైవేటు వాహనాల్లో చార్జీల మోత
- మంగళవారం అర్ధరాత్రి నుంచే నగరానికి పయనం
- కిక్కిరిసిపోయిన బస్టాండ్లు, రైల్వేస్టేషన్లు
- సిటీ బస్సులు జిల్లాలకు తరలించడంతో తప్పని తిప్పలు
- యాప్ ఆధారిత వాహనాల్లో గమ్యస్థానాలకు..
- అందులోనూ రెట్టింపు చార్జీలు
సిటీబ్యూరో, అక్టోబర్ 21 (నమస్తే తెలంగాణ): పండుగకు ఊరెళ్లిన వారి నగర తిరుగు ప్రయాణాలు సైతం ఖరీదుగానే మారాయి. సంతోషంతో పండుగకు ఊరెళ్లాలనుకున్న వారిపై ప్రభుత్వం చార్జీల భారం మోపిన విషయం తెలిసిందే. 50 శాతం అదనపు చార్జీలు వసూ లు చేసి పండుగ మురిపెం లేకుండా చేసింది.
ఆ చార్జీలకు భయపడి కొన్ని కుటుంబాలు ప్రయాణాలు సైతం వాయిదా వేసుకున్న సంఘటనలు ఉన్నాయి. ఇప్పుడు ఊరెళ్లిన వారు నగరానికి చేరుకోవడానికి సైతం చార్జీల మోత వెంటాడుతున్నది. మంగళవారం అర్ధరాత్రి నుంచే నగరానికి తిరుగు ప్రయాణాలు మొదలయ్యాయి. అయితే చార్జీల హీట్ మాత్రం తగ్గలేదు. ప్రయాణ ఖర్చులతో పండుగ జరుపుకోవచ్చని ప్రయాణికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. హన్మకొండ, భద్రాచలం, నిజామాబాద్, మంచిర్యాల, కరీంనగర్ తదితర జిల్లాల నుంచి నగర సర్వీసులే నడుస్తున్నాయి.
నగరంలోని 26 డిపోలు ఉంటే 3200 బస్సుల్లో సుమారు 2వేలకు పైగా బస్సులు దసరా ప్రత్యేక బస్సులుగా ఆర్టీసీ నడుపుతున్నది. సిటీ బస్సులకే స్పెషల్ బోర్డులు తగిలించి రెట్టింపు ధరలు వసూలు చేస్తున్నారు. అయితే ఆర్టీసీ ప్రత్యేక సర్వీసుల ప్రభావం నగర ప్రయాణికులపైన పడింది. 5 రోజులుగా నగరంలో బస్సుల కొరత వెంటాడుతున్నది. దీంతో చాలా మంది ప్రయాణికులు ఓలా, ఉబర్, ర్యాపిడో తదితర వాహన యాప్ ఆధారిత సేవలపై ఆధారపడాల్సి వస్తోంది. రెండు కిలో మీటర్ల ప్రయాణానికి రూ.100కు పైగా ధరలు ఉంటున్నాయని ప్రయాణికులు చెబుతున్నారు.
భద్రాచలం నుంచి నగరానికి బస్సుల్లో సాధారణ టికెట్ ధర రూ. 550పై ఉంటుంది. కానీ ప్రత్యేక సర్వీసు పేరుతో రూ.11వందల పైనే వసూలు చేస్తున్నారని ప్రయాణికులు లబోదిబోమంటున్నారు. నలుగురు సభ్యులున్న ఒక కుటుంబానికి తిరుగు ప్రయాణం 4వేలు దాటిందని ఆవేదన వ్యక్తం చేశారు. మరోవైపు కొన్ని స్పెషల్ బస్సుల్లో ఉచిత ప్రయాణం కల్పించలేదని కొందరు ఆరోపించారు. ఆర్టీసీ చార్జీల మోతకు తామేం తక్కువ కాదన్నట్టు ప్రైవేటు వాహనాలు, క్యాబ్స్, ట్రావెల్స్ సైతం అందినకాడికి దండుకుంటున్నారు. హన్మకొండ నుంచి హైదరాబాద్‌కు ఒక్కరికి రూ. 700 పైనే వసూలు చేస్తున్నారని ప్రయాణికులు తెలిపారు.
బస్సులు కిటకిటలాడుతుండటంతో చాలా మంది ప్రయాణికులు ప్రైవేటు వాహనాలను ఆశ్రయిస్తున్నారు. బుధవారం తమ తమ విధుల్లో చేరాల్సి ఉండటంతో మంగళవారం అర్థరాత్రి నుంచి నగరానికి తిరుగు ప్రయాణాలు పెరిగాయి. ఈ పరిస్థితిని క్యాబ్‌లు క్యాష్‌గా మలుచుకుంటున్నాయి. రైల్లు, బస్సు స్టేషన్లు రద్దీని తలపిస్తుండటం ప్రయివేట్ వాహనాలు సైతం ఫుల్ష్త్రో ఉండటం కారణంగా ప్రయాణికులు గంటల తరబడి బస్సుల కోసం ఎదురుచూడాల్సిన పరిస్థితులు ఉన్నాయి. కొందరు నిల్చొనే ప్రయాణం చేయాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!

