e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Sunday, May 16, 2021
Home హైదరాబాద్‌ చదువుతోనే ఉజ్వల భవిష్యత్‌

చదువుతోనే ఉజ్వల భవిష్యత్‌

చదువుతోనే ఉజ్వల భవిష్యత్‌

కవాడిగూడ : చదువుతోనే ఉజ్వల భవిష్యత్‌ ఉంటుందని, తల్లిదండ్రులు తమ పిల్లలను తప్పనిసరిగా చదివించాలని అడిషనల్‌ డీజీపీ, తెలంగాణ రాష్ట్ర గురుకుల పాఠశాలల సెక్రటరీ ఆర్‌ఎస్‌. ప్రవీణ్‌కుమార్‌ సూచించారు. ఈ మేరకు ఆదివారం రాత్రి స్వేరోస్‌ ప్రతినిధి అబ్రహార్‌ హుస్సేన్‌ ఆధ్వర్యంలో భోలక్‌పూర్‌లో ‘పడావో ఔర్‌ బడావో’ బహిరంగ సభ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ గురుకుల రెసిడెన్షియల్‌ పాఠశాల్లో కార్పొరేట్‌ పాఠశాలలకు ధీటుగా మెరుగైన విద్యనందిస్తూ విద్యార్థులను ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దుతున్నారని అన్నారు. టీఎంఆర్‌ఈఐఎస్‌ అధ్యక్షుడు, రిటైర్డ్‌ డీజీపీ ఏకే. ఖాన్‌ మాట్లాడుతూ సమాజంలో ప్రత్యేక గుర్తింపు చదువుతోనే లభిస్తుందన్నారు. ఆర్‌ఎస్‌. ప్రవీణ్‌కుమార్‌ ఎంతో కష్టపడి ఉన్నత స్థాయికి ఎదిగారని పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆర్‌ఎస్‌. ప్రవీణ్‌కుమార్‌ ఇందిరానగర్‌లోని డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్‌, బాబు జగ్జీవన్‌రాం విగ్రహాలకు పూల మాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం సమీపంలోని శ్రీఈదమ్మ, పోచమ్మ దేవాలయంలో ఆయన ప్రత్యేక పూజలు చేశారు. ఎమ్మెల్యే ముఠాగోపాల్‌, రాష్ట్ర ఇన్ఫర్మేషన్‌ కమిషనర్‌ మహ్మద్‌ ఆరిఫ్‌, టీఆర్‌ఎస్‌ యువజన విభాగం నగర నాయకుడు ముఠా జైసింహ, స్వేరో గ్రేటర్‌ హైదరాబాద్‌ అధ్యక్షుడు చిరంజీవి, జోనల్‌ ఇన్‌చార్జి రుద్రం సునీల్‌, స్వేరోస్‌ నాయకులు మున్వర్‌చాంద్‌, నందు, వినోద్‌, వై. శ్రీనివాస్‌ పాల్గొన్నారు.

Advertisement
చదువుతోనే ఉజ్వల భవిష్యత్‌
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement