RS Praveen kumar | ఒకాయన గోషి కట్టుకుని గట్ల వెంబడి తిరిగి రాజశేఖర్ రెడ్డి అనుకుంటడు. గోషి కట్టుకున్నోళ్లందరూ రాజశేఖర్ రెడ్డి అయితే బాగానే ఉండు..అంటూ సీఎం రేవంత్ రెడ్డి చేసిన కామెంట్స్ పై బీఆర్ఎస్ జనరల్ సెక్రటరీ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మండిపడ్డారు. ఈ కామెంట్స్‌పై ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ.. సీఎం రేవంత్ రెడ్డి తనతో పనిచేసే సహచరులను కూడా దెప్పి పొడుస్తున్నరు. నిజానికి తెలంగాణలో అత్యంత బాధతో, విషాదంతో ఎవరన్నా బతుకుతున్నారంటే.. అది మల్లు భట్టి విక్రమార్క. ఆయన ఇవాళ ప్రజా భవన్లో కూర్కొని కన్నీరుమున్నీరుగా విలపిస్తుంటడన్నారు.
రేవంత్ రెడ్డి మీరు ఆయన్ను ఏమన్నరు. గోషి కట్టుకున్నవాళ్లంతా రాజశేఖర్ రెడ్డి కాలేరు అన్నరు. మరి మల్లు భట్టి విక్రమార్కకు డైరెక్టుగా చెప్పొచ్చు కదా.. ఆయన్ను మీరు ఎన్ని సార్లు అవమానిస్తరు. యాదాద్రి లక్ష్మీనరసింహ స్వామి సాక్షిగా మీరందరూ కుర్చీలో కూర్చొని ఆయనను భూమి మీద కూర్చోబెట్టారు. దాని తర్వాత ఒక మీటింగ్‌లో మీరు, కోమటి రెడ్డి ఇద్దరూ కలిసి ఆయన పొట్టలో గుద్దారు. అప్పుడు కూడా ఆయన ఏం అనలేదు. ఇంకా అది సరిపోలేదని మళ్లీ ఇప్పుడు పక్కలో బల్లెం లాగా ఉన్నడని గోషి కట్టుకున్నోళ్లంతా కూడా రాజశేఖర్ రెడ్డి కాలేరని ఎవరిని అంటున్నరు.. ఖుల్లం ఖుల్లా మీరు మల్లు భట్టివిక్రమార్కను అంటున్నారు. అంటే ఎస్సీలు గోషి కట్టుకోవద్దా.. మంచి బట్టలు వేసుకోవద్దా.. ఎస్సీలు ఉపముఖ్యమంత్రులుగా ఉండొద్దా..? మీరే చెప్పాలన్నారు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్.
గోషి కట్టుకుని తిరిగే ప్రతి ఒక్కరు వైఎస్ రాజశేఖర్ రెడ్డి కాలేడు pic.twitter.com/pCpDVTxpyG
— Telugu Scribe (@TeluguScribe) June 5, 2026
గోషి కట్టుకున్న వాళ్ళు అంత రాజేశేఖర్ రెడ్డి కాలేరని భట్టి విక్రమార్కను రేవంత్ అవమానించాడు
రేవంత్ రెడ్డి తనతో పనిచేస్తున్న సహచరులను కూడా దెప్పి పొడుస్తూ ఉన్నారు
తెలంగాణలో భాదతో, విషాదంతో బ్రతుకుతుంది ఎవరైనా ఉన్నారు అంటే అది భట్టి విక్రమార్కనే
ఎన్ని సార్లు ఇలా ఆయనను… https://t.co/oOAHgn1Tjg pic.twitter.com/ZPU9E5Luxl
— Telugu Scribe (@TeluguScribe) June 6, 2026