BRS | యూత్ డిక్లరేషన్ పేరిట యువతను వంచించిన కాంగ్రెస్ పార్టీని ఎండగట్టడానికి బీఆర్ఎస్ పార్టీ రేపు తలపెట్టిన యువ సంగ్రామ సదస్సుకు అనుమతులు ఇవ్వకుండా రేవంత్ సర్కార్ వేధిస్తున్నది. రేపు సరూర్ నగర్లో జరిగే సదస్సు కోసం ఇప్పటికే బీఆర్ఎస్ యువజన, విద్యార్థి విభాగాలు అన్ని ఏర్పాట్లు పూర్తిచేశాయి. అయితే ఈ సభకు ఆటంకం కలిగించేందుకు పోలీసులు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలిసింది.
ఈ సందర్భంగా బీఆర్ఎస్ నాయకుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ..బీఆర్ఎస్ తలపెట్టిన యువ సంగ్రామ సదస్సు ఎట్టి పరిస్థితిలో ఆగదని స్పష్టం చేశారు. పోలీసులు దయచేసి రేవంత్ రెడ్డి అక్రమ ఆదేశాలు పాటించకండి.. చట్ట ప్రకారం నడుచుకోండని హితవు పలికారు. చట్ట ప్రకారం అన్నీ పాటిస్తున్నామని ఆయన పేర్కొన్నారు.
బీఆర్ఎస్ తలపెట్టిన యువ సంగ్రామ సదస్సు ఎట్టి పరిస్థితిలో ఆగదు
చట్ట ప్రకారం అన్నీ పాటిస్తున్నాము
పోలీసులు దయచేసి రేవంత్ రెడ్డి అక్రమ ఆదేశాలు పాటించకండి.. చట్ట ప్రకారం నడుచుకోండి
మేము మాత్రం ఈ సభ జరిపి తీరుతాం
– ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ https://t.co/mGVPIQ2mnK pic.twitter.com/aVcXHYHg1H
— Telugu Scribe (@TeluguScribe) July 17, 2026