ముషీరాబాద్/ కవాడిగూడ/ చిక్కడపల్లి, ఆగస్టు 22: అభివృద్ధి నిర్మాణ పనులను త్వరితగతిన పూర్తి చేసి, ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని ఎమ్మెల్యే ముఠా గోపాల్ అధికారులను ఆదేశించారు. ఈ మేరకు మంగళవారం భోలక్‌పూర్‌లోని బ్యాంక్ ఆఫ్ బరోడా కాలనీలో రూ. 59.30 లక్షల నిధులతో సీసీ రోడ్డు నిర్మాణ పనులను ఆయన స్థానిక కార్పొరేటర్ మహ్మద్ గౌసొద్దీన్ తహ, బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు ముఠా జయసింహ, జీహెచ్ఎంసీ డీఈ సన్ని, ఏఈ బి. సుభాష్‌లతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ .. నియోజక వర్గంలోని ఆరు డివిజన్లలో డ్రైనేజీ, తాగునీటి సమస్యలతో పాటు ఇతర సమస్యలను పరిష్కరించడం జరిగిందని అన్నారు. అభివృద్ధి పనుల్లో నాణ్యతా ప్రమాణాలు పాటించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో భోలక్‌పూర్ బీఆర్ఎస్ అధ్యక్షుడు వై. శ్రీనివాస్‌రావు, ఉపాధ్యక్షుడు శంకర్ గౌడ్, మాజీ అధ్యక్షుడు మహ్మద్ అలీ, ముచ్చకుర్తి ప్రభాకర్, జబ్బార్, గోవింద్రాజ్ తదితరులు పాల్గొన్నారు.
ఎమ్మెల్యే ముఠా గోపాల్‌కు మూడోసారి టికెట్‌ను కేటాయించడం పల్ల హర్షం వ్యక్తం చేస్తూ జీహెచ్ఎంసీ అధికారులు పూల బొకేను అందజేసి ఘనంగా సత్కరించారు. బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు ముఠా జయసింహ, భోలక్‌పూర్ అధ్యక్షుడు వై. శ్రీనివాస్ రావు, గోవింద్ రా జ్, రహీం, ముచ్చకుర్తి ప్రభాకర్, శంకర్‌గౌడ్, వాటర్ వర్క్స్ డీజీఎం కార్తిక్‌రెడ్డి, జీహెచ్ఎంసీ డీఈ సన్ని, ఏఈ బి. సుభాష్, బ్యాంక్ ఆఫ్ బరోడా కాలని అధ్యక్ష, కార్యదర్శులు, బస్తీ వాసులు పాల్గొన్నారు.
బీఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు ప్రజలకు అందించడంతో పాటు నియోజకవర్గాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేశామని ఎమ్మెల్యే ముఠా గోపా ల్ అన్నారు. బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా ఎమ్మెల్యే పేరును ప్రకటించిన సందర్భంగా మంగళవారం బాగ్‌లింగంపల్లి సుందరయ్య పార్కులో వాకర్స్ క్లబ్ ఆఫ్ హైదరాబాద్ సెంట్రల్, వాకర్స్ ఆధ్వర్యంలో సంబురాలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే ముఠా గోపాల్‌ను వాకర్స్ సన్మానించారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ యువజన విభాగం నాయకుడు ము ఠా జయసింహ, క్లబ్ అధ్యక్షుడు రమేశ్‌రెడ్డి, వెంకటకృష్ణరావు(బబ్లు), పార్టీ డివిజన్ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు రావులపాటి మోజస్, మన్నె దామోదర్‌రెడ్డి, హౌస్‌ఫెడ్ డైరెక్టర్ కిషన్ రావు, క్లబ్ నాయకులు సంతోష్‌గౌడ్, రఫీ, నిరంజన్ రెడ్డి, నాగభూషణం, భగత్గౌడ్, బీఆర్ఎస్ నాయకులు, టెంపుల్ జనర్దాన్, ఆర్. వివేక్, వాకర్స్ వెంకట్ స్వామిగౌడ్ తదితరులు పాల్గొన్నారు.
ముషీరాబాద్ నియోజకవర్గం బీఆర్ఎస్ పార్టీకి అడ్డా అని, వచ్చే ఎన్నికల్లో భారీ విజయాన్ని సాధించబోతుందని ఎమ్మెల్యే ముఠా గోపాల్ అన్నారు. మంగళవారం ముషీరాబాద్ డివిజన్ కమిటీ ఆధ్వర్యంలో పా ర్శిగుట్ట ఎస్ఎల్ఎన్ ఫంక్షన్ హాల్లో ఎమ్మెల్యే అభ్యర్థిగా ఎంపికైన ముఠా గో పాల్‌కు సత్కార సభ జరిగింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. నిత్యం ప్రజల మధ్య ఉండి వారి సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తున్న తన సేవలు గుర్తించి సీఎం కేసీఆర్ మరోసారి బీఆర్ఎస్ పార్టీ టికెట్ ఇచ్చారని అన్నారు. సీఎంకు తనపై ఉన్న నమ్మకాన్ని వమ్ముచేయకుండా గత ఎన్నికల్లో వచ్చిన మెజారిటి కంటే రెట్టింపు ఓట్లు సాధిస్తానని ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు ముఠా జయసింహ, టీ సోమసుందర్, ముషీరాబాద్ డివిజన్ బిఆర్ఎస్ అధ్యక్షుడు కాడబోయిన నర్సింగ్ ప్రసాద్, వర్కింగ్ ప్రెసిడెంట్ శ్రీధర్‌రెడ్డి, ప్రధాన కార్యదర్శి ఆకుల అరుణ్‌కుమార్, ట్రేడ్సెల్ అధ్యక్షుడు శ్రీనివాస్, శోభ, శివ ముదిరాజ్, శ్రీకాంత్‌గౌడ్, శ్రీధర్‌గౌడ్, భాస్కర్ తదితరులు పాల్గొన్నారు.
ముషీరాబాద్‌లో ఎమ్మెల్యే ముఠా గోపాల్‌ను భారీ మెజారిటీతో గెలిపించుకుని సీఎం కేసీఆర్‌ను హ్యాట్రిక్ సీఎంగా చేస్తామని బీఆర్ఎస్ నగర నాయకుడు రవీంద్ర కోక అన్నారు. ఈ మేరకు మంగళవారం ముషీరాబాద్ నియోజక వర్గం బీఆర్ఎస్ అభ్యర్థిగా ముఠా గోపాల్‌కు టికెట్ కేటాయించడం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ ఎమ్మెల్యే ముఠా గోపాల్‌ను సత్కరించారు. బీఆర్ఎస్ భోలక్‌పూర్ అధ్యక్షుడు వై. శ్రీనివాస్‌రావు, భూతముల ఆంజనేయులు, కొమ్ము రాజేశ్, రాముగౌడ్, ఏమనోళ్ల శివకుమార్, కిరణ్, శ్రీనివాస్, చింటూ, లక్ష్మణ్, ఎండీ పాషా, ఆక్వాలేక్ హుస్సేన్, చంద్రకాంత్ పాల్గొన్నారు.
ఎమ్మెల్యే ముఠా గోపాల్‌కు బీఆర్ఎస్ బీఆర్ఎస్ టికెట్ ఇవ్వడం పట్ల హర్షం వ్యక్తంచేస్తూ బీఆర్ఎస్ మైనారిటీ సెల్ నాయకుడు మహ్మద్ ఆరీఫొద్దీన్ ఆధ్వర్యంలో మంగళవారం రాత్రి భోలక్‌పూర్ డివిజన్లోని అఖిల్షా దర్గాలో ఎమ్మెల్యే ప్రత్యేక ప్రార్థనలు చేసి మొక్కులు తీర్చుకున్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు ముఠా జయసింహ, భోలక్‌పూర్ డివిజన్ అధ్యక్షుడు వై. శ్రీనివాస్‌రావు, అబ్ధుల్ రహీం పాల్గొన్నారు.