మల్కాజిగిరి: అభివృద్ధే లక్ష్యంగా బీఆర్ఎస్ పార్టీ కృషి చేస్తుందని మల్కాజిగిరి సర్కిల్ జేఏసీ అధ్యక్షుడు వెంకన్న అన్నారు. మల్కాజిగిరి అభివృద్ధి కోసం రూ.384.82 కోట్ల నిధులను మంజూరు చేయించి.. నియోజకవర్గ ప్రజలకు అండగా నిలిచిన ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు. మల్కాజిగిరి నియోజక వర్గంలో రూ.384.82కోట్లతో రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాల సమన్వయంతో జరుగుతున్న అభివృద్ధి పనులపై ఆనంద్‌బాగ్‌లోని బృందావన్ ఫంక్షన్ హాల్లో బీఆర్ఎస్ పార్టీ నాయకులు విలేకరుల సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా జేఏసీ అధ్యక్షుడు వెంకన్న మాట్లాడుతూ ట్రాఫిక్ సమస్యను పరిష్కరించడానికి రామకృష్ణాపురం ఫ్లై ఓవర్ బ్రిడ్జ్ వద్ద రూ.210కోట్లతో మరో ఆర్ఓబీ, రూ.35కోట్లతో ఆర్యూబీని ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి మంజూరు చేయించారన్నారు. జీహెచ్ఎంసీ నుంచి సాధరాణ పనుల కోసం రూ.7కోట్లు, బాక్స్ డ్రైనేజీకి రూ.6కోట్లు, మౌలాలిలోని బండ చెరువు వద్ద రూ.1.7కోట్లతో బాక్స్ డ్రైనేజీ నిర్మాణం కోసం నిధులు మంజూరు చేయించారని చెప్పారు. వాజ్పేయినగర్ వద్ద ఆర్యూబీ రూ.72కోట్లు, గౌతంనగర్ వద్ద రూ.28కోట్లు, అల్వాల్ సర్కిల్ తుర్కపల్లి వద్ద రూ.8కోట్లు, జనప్రియ అపార్టుమెంట్ వద్ద రూ.8కోట్లతో ఆర్‌యూబీలు నిర్మించనున్నారని పేర్కొన్నారు.
మల్కాజిగిరి, అల్వాల్ సర్కిల్ళ్లలో విద్యుత్ సమస్యలు రాకుండా రూ.9.74కోట్లతో త్రీ ఫేస్ సరఫరా, కొత్తగా ట్రాన్స్ ఫార్మర్లు, ఇంటర్ లింక్ ఫీడర్లను ఏర్పాటు కానున్నాయని వెల్లడించారు. డిగ్రీ కాలేజీకి 2 ఎకరాల స్థలం కేటాయింపు, 500 గజాల్లో ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఏర్పాటుకు స్థలాలను ఎమ్మెల్యే మంజూరు చేయించారన్నారు. ఇప్పటికే నేరేడ్మెట్లో జిల్లా కోర్టు భవనాలను రూ.46కోట్లతో నిర్మిస్తున్నారని, అల్వాల్‌లో 11 గుంటల స్థలంలో ఫైర్ స్టేషన్ మంజూరైనట్లు చెప్పారు. కార్యక్రమంలో కార్పొరేటర్లు సునీత యాదవ్, మురుగేశ్, మాజీ కార్పొరేటర్ జగదీశ్‌గౌడ్, అంజయ్య, పరశురాంరెడ్డి, రాముయాదవ్, ఖలీల్ తదితరులు పాల్గొన్నారు.