శంషాబాద్ రూరల్, ఫిబ్రవరి 18: శంషాబాద్ విమానాశ్రయంలో పెద్దమొత్తంలో విదేశీ కరెన్సీ (Foreign Currency) పట్టుబడింది. మంగళవారం ఉదయం హైదరాబాద్ నుంచి దుబాయ్‌కి వెళ్తున్న ఓ ప్రయాణికుడి కదలికలపై సీఐఎస్ఎఫ్ అధికారులకు అనుమానం వచ్చింది. దీంతో అతడిని క్షుణ్ణంగా తనిఖీ చేయగా 22 లక్షల విలువైన విదేశీ కరెన్సీ లభించింది. కరెన్సీని స్వాధీనం చేసుకుని సీజ్ చేశారు. ప్రయాణికుడిని అమీర్ అహ్మద్‌గా గుర్తించారు. అతడిని అదుపులోకి తీసుకొని ప్రశ్నిస్తున్నారు.
ఓఆర్ఆర్పై ఇద్దరు వ్యక్తులు రెండు కార్లతో స్టంట్(Car Stunts) చేసిన విషయం తెలిసిందే. లగ్జరీ ఎస్యూవీ కారుల్లో ఇద్దరు రింగు రోడ్డుపై స్టంట్ చేశారు. ఫార్చూనర్, బీఎండబ్ల్యూ కార్లతో వాళ్లు చక్కర్లు కొట్టారు. ఆ స్టంట్ అక్కడ ఉన్న సీసీటీవీ కెమెరాలకు చిక్కింది. ఫిబ్రవరి 9వ తేదీన ఈ ఘటన జరిగింది. అయిదు లేన్ల రోడ్డుపై వాళ్లు ఆ స్టంట్ పర్ఫార్మ్ చేశారు.
లగ్జరీ కార్లతో స్టంట్ చేసిన విద్యార్థుల్ని పోలీసులు పట్టుకున్నారు. శంషాబాద్ ఎయిర్‌పోర్టు పోలీసులు వాళ్లను అరెస్టు చేశారు. రాజేంద్రనగర్‌కు చెందిన 25 ఏళ్ల మొహమ్మద్ అబ్దుల్లా, మలక్‌పేటకు చెందిన 25 ఏళ్ల జోహెయిర్ సిద్ధిక్‌లను ఆధీనంలోకి తీసుకున్నారు. లగ్జరీ కార్లను కూడా సీజ్ చేశారు. హ్యాండ్‌బ్రేక్ వేసి ఓఆర్ఆర్ పై .. కార్లతో సర్కిల్స్ కొట్టారు. స్టంట్స్ చేసిన సమయంలో నెంబర్ ప్లేట్లను తొలగించారు.