సిటీబ్యూరో, మార్చి 6 (నమస్తే తెలంగాణ): సైబరాబాద్ పోలీసు కమిషనరేట్ పరిధిలోని రాజేంద్రనగర్ జోన్ పరిధిలో పోలీసు గస్తీకి సుస్తీ పట్టుకుందనే విమర్శలు వినిపిస్తున్నాయి. దీంతో నేరస్తులు రెచ్చిపోతున్నారని ప్రజలు ఆరోపిస్తున్నారు. దోపిడీ దొంగలు తమ పని తాము కానిస్తుండగా స్నాచర్లు, రౌడీలు, అల్లరి మూకలు ఇలా ఎవరి పని వారు సాఫీగా చేసుకుపోతున్నార ప్రజలు ఆవేధన వ్యక్తం చేస్తున్నారు.
ఈ క్రమంలోనే ఈనెల 2, తెల్లవారుజామున మైలార్‌దేవ్‌పల్లి ఠాణా పరిధిలో ప్రధాన రహదారిపై ఉన్న ఎస్బిఐ ఏటీఎంను దోచుకునేందుకు దోపిడీ దొంగలు యత్నించిన విషయం తెలిసిందే. అయితే ఏటీఎంలో నుండి డబ్బులు రాకపోవడంతో ఆ యంత్రాన్ని తగులబెట్టారు. తెల్లవారుజామున 3-4గంట మధ్య జరిగిన ఈ ఘటనలో దుండగులు ఏటీఎం సెంటర్లో యధేచ్చగా దోపిడీ కోసం కనీసం అరగంటకు పైగా సమయం కేటాయించారంటే స్థానికంగా ఉన్న భద్రత ఏపాటిదో అర్ధం చేసుకోవచ్చు. అంతే కాకుండా దుండగులు ఏటీఎం యంత్రానికి పుప్పు పెట్టినా ఉదయం వరకు విషయం ఎవరికీ తెలియదు. రాత్రి లేదా తెల్లవారుజాము సమయంలో పోలీసు గస్తీ తిరిగి ఉంటే ఇలాంటి ఘటనలు చోటుచేసుకోవని స్థానిక ప్రజలు అభిప్రాయపడుతున్నారు.
కనిపించని పాట్రోలింగ్: రాజేంద్రనగర్ జోన్ పరిధిలో పోలీసు పాట్రోలింగ్ వాహనాలు గస్తీ తిరగడం పెద్దగా కనిపించడం లేదంటున్నారు స్థానిక ప్రజలు. సరైన గస్తీ లేకపోవడంతో జోన్ పరిధిలోని పలు ఠాణాల పరిధిలో ప్రజల భద్రత ప్రశ్నార్థకంగా మారుతుందని ప్రజలు వాపోతున్నారు. 1068చ.కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉన్న రాజేంద్రనగర్ జోన్ ఇటీవలే కొత్తగా ఏర్పాటైంది.
గతంలో శంషాబాద్ జోన్ పరిధిలో ఉన్న ఈ ప్రాంతాన్ని పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా నేర నియంత్రణ, ప్రజలకు మరింత భద్రత కల్పించాలనే ఉద్ధేశ్యంతో బీఆర్ఎస్ ప్రభుత్వం పోలీసు పునర్వ్యవస్థీకరణలో భాగంగా ఈ జోన్‌ను ఏర్పాటు చేసింది. అంతే కాకుండా ఈ జోన్ పరిధిలోని కొత్తగా నార్సింగి ఏసిపి డివిజన్‌తో పాటు అత్తాపూర్, మోకిల్ల ఠాణాలను సైతం కొత్తగా ఏర్పాటు చేసింది. రాజేంద్రనగర్ జోన్లో చేవెళ్ల, నార్సింగి, రాజేంద్రనగర్ ఏసీపీ డివిజన్లు ఉండగా మొత్తం 9పోలీసు స్టేషన్లు ఉన్నాయి.
70నుంచి 80శాతం భూ తగాదాలకు సంబంధించిన కేసులు ఉండే ఈ జోన్ పరిధిలో హత్యలు, ప్రతికార దాడులు, ఆస్థి తగాదాలు, దోపిడీ దొంగతనాలు, దారిదోపిడీలు, డ్రగ్స్ తదితర కేసులు కూడా అధికంగానే ఉండడంతో గత ప్రభుత్వం ఈ జోన్‌పై ప్రత్యేక దృష్టి పెట్టింది. నిరంతరం పోలీసు నిఘా ఉండేలా సీసీ కెమెరాలతో పాటు 24గంటల పాటు పోలీసు గస్తీ తిరిగేలా చర్యలు చేపట్టింది. ఎక్కడైన ఘటన జరిగిన 10నిమిషాల్లోనే సంఘటనా స్థలానికి చేరుకునేలా పోలీసింగ్‌ను ఏర్పాటు చేసింది. కాని గత కొంత కాలంగా ఈ జోన్ పరిధిలో పోలీసు గస్తీ పెద్దగా కనిపించడం లేదంటున్నారు జనాలు. కనీసం రాత్రి సమయంలోనైనా పోలీసు గస్తీ తిరిగితే ఈ దారిదోపిడీలు, దొంగతనాలే కాకుండా ఇతర అసాంఘీక కార్యకలాపాలు, రౌడీల దౌర్జన్యాలు వంటి వాటికి చెక్‌పడుతుందని ప్రజలు భావిస్తున్నారు.
రౌండ్స్ మరిచిన అధికారులు: పోలీసు గస్తీలో భాగంగా గతంలో ఎస్హెచ్ఒ స్థాయి నుంచి ఏసీపీ స్థాయి, కొన్ని సందర్భాల్లో డీసీపీ స్థాయి అధికారులు సైతం సంబంధిత ప్రాంతాల్లో రౌండ్స్ తిరిగేవారు. ముఖ్యంగా రాత్రి సమయాల్లో సాధారణ గస్తీతో సంబంధం లేకుండా అధికారులు ప్రత్యేకంగా రౌండ్స్ తిరుగుతూ శాంతిభద్రతలను పర్యవేక్షించేవారు. ప్రస్తుతం ఈ జోన్ పరిధిలో ఆ పరిస్థితులు పెద్దగా కనిపించడం లేదు. చాలా మంది అధికారులు తమ కార్యాలయాలను వదిలి ఏరియాల్లోకి వెళ్లడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. కొంత మంది అధికారులు భూ తగాదాలకే అధిక ప్రాధాన్యం ఇస్తూ కార్యాలయాలకే పరిమితమవుతున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. అధికారుల మీటింగ్‌లు, బందోబస్తు చర్యలు వంటి సందర్భాలు, ఏవైన తీవ్రమైన ఘటనలు జరిగినప్పుడు తప్ప బయటకు రావడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి.
రాజేంద్రనగర్ జోన్ పరిధిలో జరుగుతున్న దోపిడీ, దొంగతనాల్లో పోలీసులు కేసులను చేధించడంతో పాటు చోరీకి గురైన సొత్తును రికవరీ చేయడంలో పోలీసులు సఫలీకృతమవుతున్నారు. అయితే పోలీసు గస్తీ, నిఘా పెంచడం వల్ల ఈ నేరాలు జరగకుండా అడ్డుకోవచ్చు. అంతే కాకుండా తరచూ జరుగుతున్న నేరాళతో పోలీసులు వాటిని చేధించేందుకే పరిమితం కావాల్సివస్తోంది. దీంతో ఇతర అంశాలపై పూర్తిస్థాయి దృష్టి పెట్టలేకపోతున్నారనే విమర్శలు వస్తున్నాయి.
రాజేంద్రనగర్ జోన్ పరిధిలో మొత్తం 30పాట్రోలింగ్ వాహనాలు ఉన్నా యి. వీటితో పాటు 34బ్లూకోట్స్ ద్విచక్రవాహనాలు అందుబాటులో ఉన్నాయి. బందోబస్తు, ఇతర అత్యవసర విధుల కారణంగా బ్యూకోట్స్ వాహనాలు గస్తీ తిరగలేకపోయినా 30పాట్రోలింగ్ జీపులు మాత్రం గస్తీ తిరుగుతాయి. పాట్రోలింగ్ విధులు నిర్వహించే వారికి బందోబస్తు విధులతో సంబంధం లేదు. పాట్రోలింగ్ వాహనాలు ప్రణాళిక ప్రకారం గస్తీ తిరగాల్సిందే. అవసరమైతే గస్తీని మరింత ముమ్మరం చేస్తాం. పాట్రోలింగ్ వాహనాలు ఎక్కడ ఉన్నాయి, ఎంతసేపు ఉన్నాయని అనే సమాచారాన్ని తెలుసుకునేందుగులు అతడిపై హెల్మెంట్లతో దాడిచేసి, అతడి ఒంటిపై ఉన్న నగలను దోచుకెళ్లారు.