హైదరాబాద్: హైదరాబాద్‌లోని (Hyderabad) ఫిల్మ్‌నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో భారీ దొంగతనం జరిగింది. ఓ ఇంట్లో 43 తులాల బంగారం, రూ.లక్ష నగదును దుండగులు ఎత్తుకెళ్లిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఓయూ కాలనీకి చెందిన స్వప్న భర్త ఇటీవల మరణించారు. దీంతో గత నెల 27న అత్తగారి ఇంటికి వెళ్లిన ఆమె ఈ నెల 5న తిరిగి వచ్చారు. ఇంట్లో చూసేసరికి బంగారం, నగదు చోరీ అయినట్లు గుర్తించిన ఆమె.. పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదుచేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.