Super Fast Train | కాచిగూడ,డిసెంబర్ 18: మహబూబ్‌నగర్ సూపర్‌ఫాస్ట్ రైల్లో ఓ ప్రయాణికుని బంగారు అభరణాలు, నగదును దొంగిలించారు. రైల్వే ఇన్స్పెక్టర్ ఎల్లప్ప వివరాల ప్రకారం నాచారం ప్రాంతానికి చెందిన శివాజిపటేల్(66) అహ్మదాబాద్-కాచిగూడ -మహబూబ్‌నగర్ సూపర్‌ఫాస్ట్ రైల్లో ఏ-1 కోచ్‌లో కాచిగూడకు వస్తుండగా మార్గమధ్యంలోని జల్గాన్ రైల్వేస్టేషన్ జంక్షన్ సమీపంలో బ్యాగు చూసుకునేసరికి అందులో ఉన్న 35 గ్రాముల బంగారు అభరణాలు, రూ.30వేలు, ఖరీదైన 2 సెల్పోన్లు కనిపించలేదు. దీంతో బుధవారం కాచిగూడ రైల్వే పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకొని తదుపరి విచారణ నిమిత్తం బుస్వాల్ రైల్వేస్టేషన్‌కు బదిలీ చేసినట్లు కాచిగూడ రైల్వే పోలీసులు తెలిపారు.
మూసాపేట ప్రాంతానికి చెందిన జైన్ దివేక్కుమార్(40)వృత్తిరీత్యా ప్రైవేటు ఉద్యోగి. అహ్మదాబాద్-కాచిగూడ మహబూబ్‌నగర్ సూపర్‌ఫాస్ట్ రైల్లో కాచిగూడ రైల్వేస్టేషన్‌కు వస్తుండగా మార్గమధ్యలో ఉన్న జల్గాన్ రైల్వేస్టేషన్ జంక్షన్ సమీపంలో బ్యాగు చూసుకునేసరికి అందులో ఉన్న 11 గ్రాముల బంగారు అభరణాలు, రూ.8 వేల రూపాయలు, సెల్‌ఫోన్ కన్పించలేదు. దీంతో ఆయన బుధవారం కాచిగూడ రైల్వే పోలీసులకు పిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకొని తదుపరి విచారణ నిమిత్తం బుస్వాల్ రైల్వేస్టేషన్‌కు బదిలి చేసినట్లు కాచిగూడ రైల్వే పోలీసులు తెలిపారు.