సిటీబ్యూరో, సెప్టెంబర్ 1 (నమస్తే తెలంగాణ): స్నాచరు,్ల దోపిడీ దొంతలు బరితెగిస్తున్నారు.. వరుస ఘటనలతో నగరంతోపాటు శివారు ప్రాంతాలలోని ప్రజలు బెంబేలెత్తుతున్నారు. ఒక పక్క వినాయక నవరాత్రులు సందడి నెలకొనగా.. మరో పక్క స్నాచర్లు రెచ్చిపోతుండడం ఆందోళన కల్గిస్తోంది.
వినాయక నవరాత్రుల సందర్భంగా పోలీసులు ఎక్కువగానే తిరుగుతుంటారు, అయినా స్నాచర్లు వరుస ఘటనలకు పాల్పడుతుండడంతో ఎక్కడికక్కడే కొత్త ముఠాలు ఏర్పడ్డాయా? అనే అనుమానాలు కలుగుతున్నాయి. స్నాచింగ్లపై ఉక్కుపాదం మోపాల్సిన పోలీసులు ఆ దిశగా చర్యలు చేపట్టకపోవడంతో స్నాచర్లు రెచ్చిపోతున్నారని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
వరస ఘటనలతో ఆందోళన
స్నాచింగ్లు, దోపిడీ దొంగతనాలతో ప్రజలు భయపడుతున్నారు. సీసీ కెమెరాల నిఘాలో సురక్షితంగా ఉన్నామనే భావనలో గత పదేండ్లు ప్రశాంతంగా నగర వాసులు జీవనం సాగించారు. కానీ నగరంతో పాటు శివారు ప్రాంతాలలో ఉండే ప్రజలు సురక్షితంగా ఉండాలంటే పోలీసులు మరిన్ని పటిష్ట చర్యలు తీసుకొని స్నాచింగ్లు, దోపిడీ, దొంగతనాలపై ఉక్కుపాదం మోపాలని ప్రజలు కోరుతున్నారు.