హైదరాబాద్ : గోషామహల్ పోలీసు స్టేషన్ పరిధిలోని చాక్నవాడిలో శుక్రవారం మధ్యాహ్నం ఘోర రోడ్డుప్రమాదం జరిగింది. ఉన్నట్టుండి రోడ్డు ఒక్కసారిగా కుంగిపోయింది. దీంతో కార్లు, ఆటోలు, ద్విచక్ర వాహనాలు ధ్వంసం అయ్యాయి. అదే రోడ్డుపై ఇవాళ వారాంతపు సంత నిర్వహించేందుకు కూరగాయల వ్యాపారులు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. రోడ్డు కుంగిపోవడంతో పలువురు జనాలు కూడా తీవ్రంగా గాయపడ్డారు. కూరగాయల బండ్లు గుంతలో పడిపోయాయి. ఆ మార్గం గుండా రాకపోకలను పోలీసులు బంద్ చేశారు. సహాయక చర్యలు చేపట్టారు.
గోషామహల్ పరిధిలోని చాక్నవాడిలో రోడ్డు కుంగిపోవడంతో కార్లు, ఆటోలు ధ్వంసమయ్యాయి. పలువురు తీవ్రంగా గాయపడ్డారు. pic.twitter.com/FPGFwgVCP0
— Namasthe Telangana (@ntdailyonline) December 23, 2022
గోషామహల్ పరిధిలోని చాక్నవాడిలో రోడ్డు కుంగిపోవడంతో కార్లు, ఆటోలు ధ్వంసమయ్యాయి. పలువురు తీవ్రంగా గాయపడ్డారు. pic.twitter.com/T36sNu3TqB
— Namasthe Telangana (@ntdailyonline) December 23, 2022