Road Accident | యునైటెడ్ కింగ్డమ్ (UK)లోని ఎసెక్స్ సిటీలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు తెలుగు విద్యార్థులు ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో ఒకరిని హైదరాబాద్‌కు చెందిన రిషితేజా రాపోలు (21)గా గుర్తించారు. మృతుడి తల్లిదండ్రులు హైదరాబాద్‌లోని ఎల్బీనగర్లో నివాసం ఉంటున్నారు. రిషితేజా ఉన్నత చదువుల కోసం యూకే వెళ్లాడు. ఎసెక్స్ పోలీసుల కథనం ప్రకారం.. రేలీ స్పర్ రౌండ్అబౌట్ వద్ద డ్యూయల్ క్యారేజ్‌వే A130లో ఆదివారం ఈ ప్రమాదం జరిగింది. ఇల్ఫోర్డ్-బార్కింగ్ ప్రాంతంలో నివసించే తొమ్మిది మంది స్నేహితులు, రూమ్మేట్స్తో సౌత్ ఎండ్-ఆన్-సీకి వెళుతుండగా ప్రమాదం జరిగిందని బీబీసీతో సహా స్థానిక మీడియా పేర్కొంది. తీవ్రంగా గాయపడిన విద్యార్థుల్లో ఇద్దరిని.. రాయల్ లండన్ ఆసుపత్రికి హెలికాప్టర్ ద్వారా తరలించారు. ఇద్దరు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించారు.