భారత్‌లో 136 దేశాల విద్యార్థులు
మన దేశంలో చదువుకొనేందుకు ఆసక్తి చూపుతున్న విదేశీ విద్యార్థుల సంఖ్య ఏటేటా పెరుగుతున్నది. దేశంలోని వివిధ ప్రతిష్ఠాత్మక విద్యాసంస్థలు, యూనివర్సిటీలకు విదేశీ విద్యార్థులు తరలివస్తున్నారు.
- చదువు కోసం విదేశీయుల రాక
- నీట్, జేఈఈకీ హాజరు
హైదరాబాద్, సెప్టెంబర్ 14 (నమస్తే తెలంగాణ): మన దేశంలో చదువుకొనేందుకు ఆసక్తి చూపుతున్న విదేశీ విద్యార్థుల సంఖ్య ఏటేటా పెరుగుతున్నది. దేశంలోని వివిధ ప్రతిష్ఠాత్మక విద్యాసంస్థలు, యూనివర్సిటీలకు విదేశీ విద్యార్థులు తరలివస్తున్నారు. అమెరికా, బ్రిటన్ లాంటి దేశాల నుంచి సైతం పలువురు విద్యార్థులు వస్తుండటం విశేషం. గతంలో పది, పన్నెండు దేశాల విద్యార్థులు మాత్రమే భారత్‌కు రాగా, ప్రస్తుతం 136 దేశాల విద్యార్థులు ఇక్కడ ఉన్నతవిద్యను అభ్యసిస్తున్నారు. నీట్, జేఈఈ ప్రవేశ పరీక్షల పట్ల ఆసక్తి చూపే విదేశీ విద్యార్థుల సంఖ్య ఏటేటా పెరుగుతున్నది. ఈ ఏడాది జేఈఈ అడ్వాన్స్‌డ్‌లో 145 మంది విదేశీ విద్యార్థులు క్వాలిఫై అయ్యారు. నీట్ యూజీ పరీక్షలో 424 మంది అర్హత సాధించారు. వీరితోపాటు ఎన్నారైలు, ఓవర్సీస్ సిటిజన్ ఆఫ్ ఇండియన్స్ సైతం గణనీయంగానే క్వాలిఫై అయ్యారు.
స్టడీ ఇండియా స్కీమ్
ఈ పథకం ద్వారా విదేశీ విద్యార్థులకు స్కాలర్షిప్లు, పలు యూనివర్సిటీల్లో ఫీజు రాయితీలు ఇస్తున్నారు. వివిధ సంస్థల్లో 25 నుంచి 100 శాతం వరకు ఫీజులను మాఫీ చేస్తున్నారు. విదేశీ విద్యార్థుల కోసం కేరళలోని అమృత విశ్వవిద్యాపీఠంలో 3,775 సీట్లు, ఆంధ్రప్రదేశ్‌లోని ఆంధ్రా వర్సిటీలో 591 సీట్లు కేటాయించారు. పథకంలో భాగంగా 2020లో 20 వేల మంది, 2021లో 50 వేల మంది దరఖాస్తు చేసుకున్నారు.
స్టడీ ఇన్ ఇండియా స్కీమ్ దరఖాస్తులు


Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
‘మల్లేశ్వరి కుటుంబానికి న్యాయం చేయాలి’
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
‘రావులపల్లికి మంజూరైన ఆస్పత్రిని వేరే ఊరికి మార్చొద్దు’
Police Commissioner | బ్యాంకులు, ఏటీఎంల వద్ద పటిష్టమైన భద్రతా ప్రమాణాలు పాటించాలి : సీపీ పోలీస్ కమిషనర్
‘రైతులను పట్టించుకోని ప్రభుత్వం’
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

