ఉర్రూతలూగించిన అర్మాన్ పాటలు
స్ట్రీట్ కాజ్ హైదరాబాద్ ఎన్జీవో ఆధ్వర్యంలో ఎల్బీ స్టేడియం వేదికగా శనివారం సాయంత్రం ఆర్ఎఫ్సీ 9.0పేరుతో జరిగిన బాలీవుడ్ సింగర్ అర్మాన్ మాలిక్ లైవ్ ఇన్ కాన్సర్ట్ వీక్షకులను ఉర్రతలూగించింది.
- ఎల్బీ స్టేడియంలో ఆర్ఎఫ్సీ 9.0 లైవ్ ఇన్ కన్సార్ట్
- ముఖ్యఅతిథిగా హాజరైన ఎంపీ మాలోత్ కవిత,
- ప్రత్యేక ఆకర్షణగా సినీనటి సమంత
సిటీబ్యూరో, ఏప్రిల్ 8 (నమస్తే తెలంగాణ): స్ట్రీట్ కాజ్ హైదరాబాద్ ఎన్జీవో ఆధ్వర్యంలో ఎల్బీ స్టేడియం వేదికగా శనివారం సాయంత్రం ఆర్ఎఫ్సీ 9.0పేరుతో జరిగిన బాలీవుడ్ సింగర్ అర్మాన్ మాలిక్ లైవ్ ఇన్ కాన్సర్ట్ వీక్షకులను ఉర్రతలూగించింది. ముఖ్యఅతిథిగా బీఆర్ఎస్ ఎంపీ మాలోత్ కవిత హాజరై నిర్వాహకులను అభినందించారు. ఎల్బీస్టేడియంలో జరిగిన ఈ కాన్సర్ట్ రెండు గంటల ముందే వీక్షకులతో ప్రాంగణం కికిరిసిపోయింది.
అర్మాన్ తన ప్రసిద్ధ పాటలైన బుట్ట బొమ్మా, కోపంగా, పెహ్లా ప్యార్ పాటలతో కాన్సర్ట్‌ను ప్రారంభిస్తూ తన పాటలతో వీక్షకులను ఓలలాడించారు. అర్మాన్ పాటకు కుర్రకారు స్వరం కలుపుతూ, డాన్స్‌లతో సరగదా ఎంజాయ్ చేశారు. ఈ ఈవెంట్ ద్వారా వచ్చే ఆదాయం సుమారు రూ.2కోట్లు వివిధ సామాజిక కార్యక్రమాలకు వినియోగించ నున్నట్లు నిర్వాహకులు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో స్ట్రీట్ కాజ్ హైదరాబాద్ ప్రెసిడెంట్ శృతి, స్ట్రీట్ కాజ్ ఇండియా సీఈఓ జి.రమ్య, సీఎఫ్ ఓ ప్రవళిక తదితరులు పాల్గొన్నారు.
ప్రత్యేక ఆకర్షణగా సమంత..
అర్మాన్ మాలిక్ లైవ్ కాన్సర్ట్‌లో శకుంతల ఫేంమ్ హీరోయిన్ సమంత ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ప్రేక్షకులతో ఫొటోలు దిగి సందడి చేశారు. ఈ కార్యక్రమంలో దిల్‌రాజు, గుణశేఖర్, మ్యూజిక్ డైరెక్టర్ మణిశర్మ పాల్గొన్నారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
సింగరేణి జీఎం కార్యాలయంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు
కార్యకర్తలకు బీఆర్ఎస్ పార్టీ అండ : కాపు సీతాలక్ష్మి
IND vs WI T20I | ఉప్పల్‌లో ఇండియా వర్సెస్ వెస్టిండీస్ టీ20.. టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న టీమిండియా
Gadwal Accident Victims | కేసీఆర్ సార్ బాగున్నారా.. హరీశ్ రావుతో గద్వాల ప్రమాద బాధితులు.. వీడియో
KTRs Meeting | కేటీఆర్ సభకు భారీగా తరలిన బీఆర్ఎస్ శ్రేణులు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

