ఓఆర్ఆర్ నుంచి కొడంగల్ వరకు రేడియల్ రోడ్డు నిర్మాణానికి రెవెన్యూ అధికారులు భూములు సర్వే చేస్తున్నారు. సర్వేను కోత్వాల్‌గూడ నుంచి రామంజాపూర్ వరకు అడుగడుగునా రైతులు అడ్డుకుంటున్నారు.
శంషాబాద్ రూరల్, జనవరి 23 : కోత్వాల్‌గూడ లో పూర్తిగా ఎన్వేకి సంబంధించిన భూములు(దేశాన్ని వదిలి వెళ్లిన పాకిస్థాన్‌కు) చెందిన భూములు ఇక్కడ సాగు చేసుకుంటున్న రైతులకు ఎవరికి పట్టదారు పాస్‌బుక్కులు లేవు. భూ సమస్యలు పరిష్కరించాలని కొంతకాలంగా రెవెన్యూ అధికారుల చుట్టూ తిరిగినా ఎలాంటి ఫలితం లేదు. కాగ తమ భూములను లాక్కొని రేడియల్ రోడ్డుకు ఎలా అనుమతి ఇస్తారని శుక్రవారం కోత్వాల్‌గూడ గ్రామస్తులు పెద్ద ఎత్తున రోడ్డుపై కూర్చొని ఆందోళనకు దిగారు. తహసీల్దార్ రవీందర్ దత్ సంఘటన స్థలానికి చేరుకొని రైతులను సముదాయించారు.
భూ సమస్యను పరిష్కరించిన తర్వాతనే రోడ్డు పనులు చేయాలని అధికారులను అడ్డుకోవడంతో వెళ్లిపోయారు. రేడియల్ రోడ్డులో మొదటగా నిర్ణయించిన ప్రకారం రాయన్నగూడ గ్రామ శివారులో సర్వే నంబర్ 11లో శాసన మండలి చైర్మన్ బంధువుల కోసం అలైన్మెంట్ మార్చిన అధికారులు పేద ప్రజల భూముల కోసం ఎందుకు మార్చారని రామంజాపూర్ గ్రామస్తులు తహసీల్దార్ రవీందర్ దత్‌కు వినతి పత్రం అందజేశారు.
రేడియల్ రోడ్డును వంద మీటర్ల దూరం నుంచి తీసుకుపోవాలని వారు అధికారులను కోరారు. మల్కారం, నర్కూడ గ్రామాల పరిధిలో భూముల సర్వేకు వచ్చిన అధికారులను రైతులు, నాయకులు ప్రజలు అడ్డుకున్నారు. రేవంత్‌రెడ్డి ప్రభుత్వం కేవలం పేద రైతులకు అన్యా యం చేస్తూ పెద్దలకు న్యాయం చేస్తుందని ఆరోపించారు.