Jeevan Reddy | రేవంత్ మూడేళ్లలో రెండు పిల్లర్లకు మరమ్మత్తు చేయించలేకపోయారు : మాజీ మంత్రి జీవన్ రెడ్డి
Jeevan reddy | మూడేళ్లు సీఎం రేవంత్ నిద్ర పోయారని.. కేసీఆర్ మూడేళ్లలోనే కాళేశ్వరం ప్రాజెక్టు కట్టారు. రేవంత్ మూడేళ్లలో రెండు పిల్లర్లకు మరమ్మత్తు చేయించలేకపోయారని జీవన్ రెడ్డి అన్నారు.
Jeevan Reddy | మేడిగడ్డ మరమ్మతుల కోసం ఒత్తిడి పెరగగానే సీఎం రేవంత్ తుమ్మిడి హట్టిపై నిద్రలేచినట్టు నటిస్తున్నారని మాజీ మంత్రి, బీఆర్ ఎస్ ప్రధాన కార్యదర్శి జీవన్ రెడ్డి అన్నారు. తెలంగాణ భవన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. మహారాష్ట్ర సీఎంతో 3 నెలలు అపాయింట్మెంట్ కోసం వృధా చేశారు. డీపీఆర్ లేకుండానే చర్చలకు ఎందుకు పోయారు.. ? కాలయాపన కోసమే ఇదంతా.. ముంపునకు సంబంధించి మహారాష్ట్ర జాయింట్ అకౌంట్లో డబ్బులు వేస్తారట .ఆశ్చర్యం కలుగుతోంది. ఎల్‌నినోపై దృష్టి పెట్టలేదు. కరువును ఎదుర్కొనే కార్యాచరణ లేదన్నారు.
కన్నె పల్లి పంప్ హౌజ్ దగ్గర 20వేల క్యూసెక్కుల ప్రవాహం ఉంది. సీపీడబ్ల్యూఆర్ ఎస్ రిపోర్ట్‌ను పక్కన పెట్టారు. కాఫర్ డ్యామ్ నిర్మాణం చేయమని మొత్తుకుంటున్నా పట్టించుకోవడం లేదని జీవన్ రెడ్డి మండిపడ్డారు.. ఒక్క టీఎంసీ నీళ్లు ఎత్తిపోసుకునే అవకాశం ఉన్నా ప్రభుత్వం స్పందించడం లేదు.. తాత్కాలిక వ్యూహం కింద ఈ పనులు చేపట్టాలి.. శాశ్వత ప్రాతిపదికన మరమ్మత్తులకు ఇది అడ్డంకి కాదు.. అన్నారం సుందిళ్ల గోదావరి మీద ఉన్నాయి.. మేడిగడ్డ ప్రాణహిత మీద ఉంది .అన్నారం ,సుందిళ్ల సురక్షితంగా ఉన్నాయి. కన్నె పల్లి నీళ్లు ఎత్తిపోసినా వాటికి నష్టం లేదు. 150 టీఎంసీ ల నీళ్లు ఎత్తిపోసే వీలున్నా ప్రభుత్వం మొద్దు నిద్రపోతోంది. రేవంత్ రెడ్డి ఏం చేస్తుండో ఆయనకే అర్థం కావడం లేదు. రేవంత్ రెడ్డి కి ఆర్ ఆర్ టాక్స్ మీద ఉన్న శ్రద్ధ నీళ్లు ఎత్తిపోయడంలో లేదని ఫైర్ అయ్యారు.
తెలంగాణకు శనిలా రేవంత్ రెడ్డి..
తుమ్మల నాగేశ్వర రావు ఖమ్మం జిల్లాలో ఇసుక బస్తాలు అడ్డం పెట్టి నీళ్లను ఆపుతున్నారు. ఆ సోయి కన్నెపల్లి విషయం లో ఎందుకు లేదు. కరువు సహాయక చర్యలు శూన్యం. ప్రభుత్వం కేవలం ప్రకటనలకే పరిమితం అయ్యింది. సీఎం ,మంత్రులు తలో రకంగా మాట్లాడుతున్నారు. రైతు కూలీలకు ఆత్మీయ భరోసా సాయం ఏమైంది. జాబ్ కార్డులు ఉన్న వారికి 12 వేల రూపాయల చొప్పున సాయం చేయాలి. వినియోగ దారుల గురించి కూడా ఆలోచించాలి. నిత్యావసరాల ధరలు అదుపులో లేవు. శ్రీ రామ్ సాగర్ ప్రాజెక్టు నీళ్లను ఆన్ అండ్ ఆఫ్ లో విడుదల చేస్తారని మంత్రి తుమ్మలకు తెలియదా ? రేవంత్ రెడ్డి తెలంగాణకు శనిలా దాపురించాడడన్నారు.
రేవంత్ రెడ్డి సీఎంగా ప్రమాణం చేసిన వెంటనే తుమ్మిడి హట్టి మొదలు పెట్టి ఉంటే ఈ పాటికి పూర్తి అయ్యేది
ఆల్మట్టిపై కర్ణాటక అనుసరించిన వ్యూహాన్నే తుమ్మిడి హట్టిపై తెలంగాణ ప్రభుత్వం అనుసరించాలి. తుమ్మిడి హట్టికి 152 మీటర్ల వద్ద శంకుస్థాపన చేసి పనులు ప్రారంభించాలి.. తర్వాత ఎంత ఒప్పందం కుదిరితే దానికి కట్టుబడాలన్నారు.
మూడేళ్లు సీఎం రేవంత్ నిద్ర పోయారని.. కేసీఆర్ మూడేళ్లలోనే కాళేశ్వరం ప్రాజెక్టు కట్టారు. రేవంత్ మూడేళ్లలో రెండు పిల్లర్లకు మరమ్మత్తు చేయించలేకపోయారని జీవన్ రెడ్డి అన్నారు. యాసంగి పంటపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలి. రైతు రేవంత్ కంటే పెద్ద ఆలోచనాపరుడు. కన్నె పల్లి పంప్ హౌజ్ ను తక్షణమే వాడుకుని రైతులను ఆదుకోవాలి. రైతు భరోసాపై ప్రభుత్వం ఏం ఛేయదలుచుకుందో చెప్పడం లేడు. కరువులో అన్ని వర్గాలకు భరోసా ఇవ్వాల్సిన భాద్యత కాంగ్రెస్ ప్రభుత్వం మీద ఉందన్నారు.
కన్నెపల్లి పంప్ హౌస్ వద్ద ఇప్పుడు కూడా 20 వేల క్యూసెక్కుల నీటి ప్రవాహం ఉంది
కేటీఆర్ జూలై నెలలో కన్నెపల్లి పంప్ హౌస్‌ను సందర్శించి, తక్షణమే నీటిని ఎత్తిపోస్తే కరువును అధిగమించవచ్చని సలహా ఇచ్చాడు
మేడిగడ్డ బ్యారేజీ వద్ద ఒక కాపర్ డ్యామ్ నిర్మాణం చేస్తే నీటి ప్రవాహాన్ని ఆపి నీటిని ఎత్తిపోసుకునే వాళ్లం
ఇంత కరువులో కూడా తెలంగాణ ప్రజలకు, రైతులకు నీళ్లు ఇచ్చేవాళ్లం
అసలు రేవంత్ రెడ్డి ఏం పాలన చేస్తున్నాడు.. RR టాక్స్‌లు వసూలు చేసుకుంటూ పాలన గాలికి వదిలేశాడు
– మాజీ మంత్రి జీవన్ రెడ్డి
— Telugu Scribe (@TeluguScribe) November 4, 2026
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
India Won: కివీస్‌తో తొలి వన్డే.. 5 వికెట్ల తేడాతో ఇండియా గెలుపు
Jeevan Reddy | రేవంత్ మూడేళ్లలో రెండు పిల్లర్లకు మరమ్మత్తు చేయించలేకపోయారు : మాజీ మంత్రి జీవన్ రెడ్డి
ములకలపల్లి మండలంలో అతి భారీ వర్షం
Munnuru Kapu | మున్నూరు కాపులకు అన్యాయం చేస్తే సహించేది లేదు : రాష్ట్ర కార్యదర్శి హెచ్చరిక
Virat Kohli: చరిత్ర సృష్టించిన విరాట్ కోహ్లీ.. వన్డేల్లో 3వ పొజిషన్లో 13 వేల రన్స్
ట్రెండింగ్ వార్తలు
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం

