Munnuru Kapu | మున్నూరు కాపులకు అన్యాయం చేస్తే సహించేది లేదు : రాష్ట్ర కార్యదర్శి హెచ్చరిక
Munnuru Kapu | మున్నూరు కాపుల హక్కుల ను కాలరాసే ప్రయత్నాలను ఎట్టి పరిస్థితుల్లోనూ సహించేది లేదని మున్నూరు కాపు సంఘం రాష్ట్ర కార్యదర్శి గదే సత్యం రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు.
మంచిర్యాల అర్బన్ : మున్నూరు కాపుల హక్కుల ( Munnuru Kapu ) ను కాలరాసే ప్రయత్నాలను ఎట్టి పరిస్థితుల్లోనూ సహించేది లేదని మున్నూరు కాపు సంఘం రాష్ట్ర కార్యదర్శి గదే సత్యం ( Satyam ) రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు. బుధవారం మంచిర్యాలలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ప్రభుత్వ తీరుపై నాయకులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కుల సంఘాలకు కేటాయించిన భూములు, భవనాల నిర్వహణపై ప్రభుత్వ పెత్తనం చెల్లదని, బీసీల అభివృద్ధికి చర్యలు తీసుకోవాల్సిన ప్రభుత్వం వారి హక్కులను హరించేలా నిర్ణయాలు తీసుకోవడం సరికాదని ఆరోపించారు .
హైదరాబాద్‌లోని కోకాపేటలో మున్నూరు కాపు సంఘ భవన నిర్మాణానికి గత ప్రభుత్వం ఐదు ఎకరాల భూమిని కేటాయించిందని గుర్తుచేశారు. ప్రస్తుత ప్రభుత్వం జీవో నంబర్ 19 ద్వారా రూ.5 కోట్లు మంజూరు చేయడాన్ని స్వాగతిస్తున్నామని తెలిపారు. అయితే అక్టోబర్ 29న విడుదల చేసిన జీవో నంబర్ 14 ద్వారా కుల సంఘాల భూములు, భవనాల నిర్వహణలో ప్రభుత్వ జోక్యానికి అవకాశం కల్పిస్తున్నారని ఆరోపించారు. సంఘాల స్వయం ప్రతిపత్తిని దెబ్బతీసే ఈ జీవోను ఎలాంటి షరతులు లేకుండా తక్షణమే ఉపసంహరిం చుకోవాలని డిమాండ్ చేశారు.
రాష్ట్రంలో మున్నూరు కాపుల జనాభా సుమారు 40 నుంచి 45 లక్షల వరకు ఉన్నప్పటికీ రాజకీయంగా తగిన ప్రాధాన్యం దక్కడం లేదని నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర మంత్రివర్గంలో ఒక్క మున్నూరు కాపు నాయకుడికి కూడా అవకాశం కల్పించకపోవడం వివక్షకు నిదర్శనమని విమర్శించారు. బీసీ కార్పొరేషన్లకు చైర్మన్లను నియమించి చేతులు దులుపుకొంటే సరిపోదని నాయకులు ప్రశ్నించారు. కనీసం కార్యాలయాలు, సిబ్బంది, నిధులు లేకుండా కార్పొరేషన్లు ఎలా పనిచేస్తాయని నిలదీశారు.
బీసీల ఆర్థికాభివృద్ధి కోసం ప్రతి కార్పొరేషన్‌కు కనీసం రూ.వెయ్యి కోట్ల చొప్పున నిధులు కేటాయించాలని డిమాండ్ చేశారు. జీవో నంబర్ 14ను ప్రభుత్వం తక్షణమే ఉపసంహ రించుకోకుంటే ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని నాయకులు హెచ్చరించారు. ఈ సమావేశంలో రాష్ట్ర వైస్ ప్రెసిడెంట్లు అంబిలపు శ్రీనివాస్, తోట శ్రీనివాస్, రాష్ట్ర ప్రచార కార్యదర్శి దేవుళ్ల అరుణ్, నాయకులు జంగపెల్లి బాపు , తోట తిరుపతి, హరిబాబా ,
అర్జేనపల్లి రాజేష్, వోడ్లల రవి, స్వర్ణకర్, నాయకులు పాల్గొన్నారు.
Read Today's Latest Adilabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Munnuru Kapu | మున్నూరు కాపులకు అన్యాయం చేస్తే సహించేది లేదు : రాష్ట్ర కార్యదర్శి హెచ్చరిక
Virat Kohli: చరిత్ర సృష్టించిన విరాట్ కోహ్లీ.. వన్డేల్లో 3వ పొజిషన్లో 13 వేల రన్స్
Ayushmann Khurrana | ఆయుష్మాన్ ఖురానాకు బెదిరింపు కాల్స్.. కోట్లు డిమాండ్ చేసిన లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్.?
బ్యాంక్ తరలించొద్దని గ్రామస్తుల ధర్నా
జయశంకర్ భూపాలపల్లి జిల్లా డాన్సర్స్ యూనియన్ నూతన కమిటీ ఎంపిక
ట్రెండింగ్ వార్తలు
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం

