Harish Rao | ఇవాళ చర్చ ద్వారా 22ఏకు ఒక క్లారిటీ వస్తదేమో అని అనుకున్నాం.. కానీ రేవంత్ రెడ్డి యూఎల్సీ భూముల మీద న్యూ పాలసీ గైడ్ లైన్స్ ఇస్తా అంటడని మాజీ మంత్రి, బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్ రావు అన్నారు.
తెలంగాణ భవన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. .. హెచ్ఎండీఏ, డీటీసీపీ లే అవుట్లు ఓ వారం రోజుల్లోపు వ్యవస్థ తెస్తం.. జిల్లా స్థాయిలో కమిటీ వేస్తం. జీవో 118 ఎల్బీ నగర్ దానిపై పరిశీలిస్తాం. ఆలోచిస్తం.. లీగల్గా పరిష్కరిస్తాం. విస్తృత స్థాయిలో సంప్రదింపులు జరుపుతం. ఫీజులు కట్టించుకుంటం.. గైడ్ లైన్స్ ఇస్తం.. హైపవర్ కమిటీ వేస్తం.. ఇవే చెప్పిండు. నీ ఇల్లు మాత్రం తీసుకున్నవ్.. నీ ఇల్లుకు ఏ హైపవర్ కమిటీ లేదు.. లీగల్గా ఆలోచించేది లేదు. కమిటీ వేసేది లేదు.. పరిష్కరించేది లేదు. ఇవన్నీ రేవంత్ రెడ్డి చెప్పినవేనన్నారు.
ఇయ్యాళ్ల కేటీఆర్ మీద.. నా మీద, మా నాయకుల మీద ఇన్ని ఆరోపణలు చేశావు కదా..బీఆర్ఎస్ హయాంలో ధరణి విషయంలో కావొచ్చు. లేదు కాంగ్రెస్ వచ్చిన డిసెంబర్ 7 2023 నుంచి ఈ రోజు వరకు భూభారతి వరకు నీ హయాంలో ఏం అవకతవకలు జరిగినయో.. మా హయాంలో ఏం జరిగినయో మొత్తం మేం విచారణకు సిద్దం. సుప్రీంకోర్టు జడ్జితో చేయిద్దామా..? హైకోర్టు సిట్టింగ్ జడ్జితో చేయిద్దామా… నువ్వు ముందుకు రా..నీ కింద పనిచేసే అధికారులు కాదు.. నీది లేదు.. నాది లేదు.. సుప్రీం కోర్డు సిట్టింగ్ జడ్జితో చేయిద్దాం. బీఆర్ఎస్ హయాంలో జరిగింది కానీ.. ఈ మూడేళ్ల రేవంత్ రెడ్డి పాలనలో జరిగిన అవకతవకల మీద, ధరణిలో, భూభారతిలో రేవంత్ రెడ్డి హయాంలో జరిగిన వాటి మీద మీ ఆస్తుల గురించి మా ఆస్తుల గురించి కూడా మాట్లాడుదామన్నారు. మా ఆస్తులు, రేవంత్ రెడ్డి ఆస్తులు నీ తమ్ముళ్ల ఆస్తులు ఎట్ల పెరిగినయ్..అన్నింటి మీద సిట్టింగ్ జడ్జితో మేం ఎంక్వైరీకి సిద్దం.. నువ్వు రెడీనా..? అని సవాల్ విసిరారు.
రేవంత్ రెడ్డి కుటుంబానికి 308 ఎకరాల భూమి ఉందని గంటన్నరలో మాకు సమాచారం వచ్చింది. రేవంత్ రెడ్డి భూమి పక్కనే ఓఆర్ఆర్ అలైన్మెంట్, బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టులు కూడా వచ్చాయని తెలిసింది. ఫ్యూచర్ సిటీ చుట్టూ, మిగతా చోట్ల ఉన్న భూముల వివరాలు అన్నీ సేకరిస్తున్నామని హరీశ్ రావు తెలిపారు.
మా ఆస్తుల మీద, రేవంత్ రెడ్డి, ఆయన సోదరుల ఆస్తులు ఎలా పెరిగాయో సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించండి.. మేము రెడీ
సుప్రీంకోర్టు జడ్జితో అయినా, హైకోర్టు జడ్జితో అయినా విచారణ జరిపించండి
ధరణి విషయంలో కావొచ్చు, భూ భారతి విషయంలో కావొచ్చు.. వీటిలో అవకతవకలపై కూడా విచారణ జరిపిద్దాం
వీటికి… https://t.co/LLNPHz3zSV pic.twitter.com/z43DKBW2dA
— Telugu Scribe (@TeluguScribe) September 16, 2026
‘భక్తిశ్రద్ధలు, సోదరభావంతో గణేష్ ఉత్సవాలను నిర్వహించాలి’
TN CM Vijay | లండన్లో తమిళనాడు సీఎం విజయ్ ఈవెంట్ రద్దు.. అభిమానులకు నిరాశ..!
Jobs Notification | ఏపీలో 2,050 ఎస్సై, కానిస్టేబుల్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల