సిటీబ్యూరో, ఏప్రిల్ 17 (నమస్తే తెలంగాణ): ఎన్నికల నిర్వహణ బాధ్యతలను సమర్థవంతంగా నిర్వర్తించాలని, ఎలాంటి పొరపాట్లకు తావివ్వరాదని రిటర్నింగ్ అధికారి అనురాగ్ జయంతి పోలింగ్, కౌంటింగ్ అధికారులకు సూచించారు. హైదరాబాద్ లోకల్ బాడీ ఎమ్మెల్సీ ఎన్నికల ప్రక్రియలో భాగంగా గురువారం ఉదయం జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో పోలింగ్ ప్రిసైడింగ్ అధికారులు, అసిస్టెంట్ అధికారులు, మైక్రో అబ్జర్వర్లు, ఓపీఓలకు రెండో విడత ఎన్నికల శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు.
మధ్యాహ్నం కౌంటింగ్ సూపర్వైజర్లు, కౌంటింగ్ అసిస్టెంట్స్, మైక్రో అబ్జర్వర్లకు మొదటి విడత శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ట్రైనింగ్ మేనేజ్మెంట్ నోడల్ అధికారి డాక్టర్ సునంద రాణి, మాస్టర్ ట్రైనర్లు విజయలక్షీ, ఈఈ మమత, పోలింగ్ పీఓలు, ఏపీఓలు తదితరులు పాల్గొన్నారు.