సిటీబ్యూరో, మార్చి 2 (నమస్తే తెలంగాణ): ఆటా, పాటా… హంగామాల మాటున రిసార్ట్స్‌లు అసాంఘీక కార్యకలాపాలకు నిలయంగా మారుతున్నాయి. నిత్యం బిజీగా ఉండే వ్యా పార, పారిశ్రామిక, సినీ ప్రముఖులు వీకెండ్స్‌ను రిలాక్స్‌గా గడపడంతో పాటు పార్టీలు చేసుకునేందుకు ఏర్పాటు చేసుకున్న రిసార్ట్స్, ఫామ్‌హౌస్‌లు పోలీసుల నిఘా లోపంతో అసాంఘీక కార్యకలాపాలకు నిలయంగా మారుతున్నాయి. వ్యక్తిగతంగా ఏర్పాటు చేసుకునే ఫామ్‌హౌస్‌లు, కమర్షియల్‌గా ఏర్పడే రిసార్ట్స్‌లను కొన్ని వ్యభిచార మాఫియాలు వేదికగా మార్చుకుంటున్నా యి.
కొంత మంది రిసార్ట్ నిర్వాహకులు విడిది పేరుతో అసాంఘిక కార్యకలాపాలకు ఆశ్రయం కల్పిస్తున్నారు. దీంతో కొందరు యువతీ యువకులు రిసార్ట్స్‌లను ఆశ్రయిస్తున్నారు. ఈ రిసార్ట్స్‌లు, ఫామ్‌హౌస్‌లు నగర శివారు ప్రాంతాలైన సైబరాబాద్ పరిధిలో ఉన్నాయి. ఇక్కడ సుమారు 137 ఫామ్‌హౌస్‌లు, 48 రిసార్ట్స్‌లు ఉన్నట్లు అధికారిక లెక్కలు చెబుతున్నాయి. అయితే అనుమతులు లేనివి కూడా పదుల సంఖ్యలో ఉన్నట్లు సమాచారం. ఫామ్‌హౌస్‌లను ఏర్పాటు చేసుకునేందుకు ఎలాంటి అనుమతులు లేకపోవడంతో యువతీ, యువకులు ఈవెంట్స్ పేరుతో రిసార్ట్స్, ఫామ్‌హౌస్‌లలో అసాంఘీక కార్యకలాపాలకు పాల్పడుతున్నారు. రిసార్ట్స్‌ల పరిస్థితి ‘ లైసెన్స్డ్ వ్యభిచార గృహాలుగా’ మారింది.
బర్త్‌డే పార్టీలు, వీకెండ్ల పేరుతో మన రాష్ట్రంతో పాటు ఇతర రాష్ర్టాలకు చెందిన యువతులతో అశ్లీల నృత్యాలు చేయిస్తూ నిర్వాహకులు సొమ్ము చేసుకుంటున్నారు. ఇందు కోసం నగర శివారు ప్రాంతాల్లోని రిసార్ట్స్, ఫామ్‌హౌజ్, గెస్ట్‌హౌజ్‌లను వేదికగా మార్చుకుంటున్నారు. కొంత మంది పెద్ద మనుషులు గుట్టు చప్పుడు కాకుండా వీటిని నిర్వహిస్తున్నట్లు సమాచారం. క్లబ్ డ్యాన్సైర్లెన యువతులతో అశ్లీల నృత్యాలు చేయించడమే కాకుండా వచ్చి న అతిధులకు అన్ని సౌకర్యాలను సమకూరుస్తున్నారు.
దీనికి తోడు మద్యం, డ్రగ్స్ తదితర వినోదాలతో చెలరేగిపోతున్నారు. నగర శివారు ప్రాంతాలైన షామీర్పేట, మేడ్చల్, శంషాబాద్, హయత్‌నగర్, మొయినాబాద్, నార్సింగి తదితర ప్రాంతాల్లో ఉన్న ఫామ్‌హౌస్‌లు, రిసార్ట్స్ లలో అనేక సార్లు పోలీసులు దాడులు జరిపి అసాంఘీక కార్యకలాపాలకు పాల్పడుతున్న యువతీ, యువకులను అరెస్టు చేశారు. ఈ క్రమంలోనే శామీర్‌పేట హైవేపై ఉన్న డార్లింగ్ కేవ్ ఫామ్‌హౌస్‌లో అసభ్యకర నత్యాలు చేస్తున్న 40మంది యువతీ,యువకులను గత సంవత్సరం మార్చిలో అరెస్టు చేసిన విషయం తెలిసిందే.
ఫామ్‌హౌస్, రిసార్ట్స్‌లలో వినోదం కల్పించేందుకు నిర్వాహకులు ముంబై , కోల్కతతో పాటు విదేశీ యువతులను సైతం రప్పిస్తున్నారు. వీరితో అర్ధరాత్రి వరకు అశ్లీల నత్యాలు చేయిస్తూ అనంతరం వ్యభిచారం నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో ఒక్కో కాల్గర్ల్కి 10 నుం చి 25వేల రూపాయల వరకు చెల్లిస్తున్నట్లు సమాచారం. అంతే కాకుండా కొంత మంది ఈవెంట్స్ నిర్వాహకులు యువతులను వారం, నెలవారీగా వేలు, లక్షల రూపాయలకు కాం ట్రాక్ట్ కుదుర్చుకుని పార్టీలకు సరఫరా చేస్తున్నట్లు సమాచారం.
పార్టీలు, ఈవెంట్స్‌ల్లో పాల్గొంటున్న వారిలో 99శాతం సంపన్న వర్గాలకు చెందిన వారే ఉంటున్నట్లు పోలీసు రికార్డుల ద్వారా తెలుస్తోంది. అయితే వీరిని చూసి మిగిలిన ఒక్కశాతం మాత్రం మధ్య తరగతి యువత కూడా వ్యసనాలకు అలవాటు పడుతూ నేరాలకు పాల్పడుతున్నట్లు చైన్‌స్నాచింగ్, దొంగతనాలు కేసుల దర్యాప్తుల్లో తేలినట్లు పోలీసులు పేర్కొంటున్నారు. వీకెండ్స్ పేరుతో విచ్చలవిడిగా డ్రగ్స్, మద్యం, వ్యభిచారం కూపిలో కూరుకుపోతోంది.
ముంబై తరహాలో రాజధాని నగరంలో అశ్లీల నృత్యాలతో విష సంస్కృతి విస్తరిస్తోంది. ఈ క్రమంలో కొంత మంది ఆమాత్యులు, పోలీసులకు కాసుల వర్షం కురుస్తుందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. వీటి నిర్వహణలో పలువురు రాజకీయ నాయకులు, బడా వ్యాపారుల హస్తం ఉన్నట్లు సమాచారం.