సిటీ బ్యూరో, మే 8 (నమస్తే తెలంగాణ): మూసీ పునరుజ్జీవన ప్రాజెక్టులో ఇండ్లను కోల్పోతున్న మధు పార్క్ రిడ్జ్ అపార్ట్మెంట్ నివాసితులు క్యాబినెట్ సబ్ కమిటీని కలిశారు. ఈమేరకు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క నేతృత్వంలోని కమిటీని శుక్రవారం మధు పార్క్ బీ బ్లాక్ అసోసియేషన్ ప్రతినిధులు కలిసి తమ వినతులను సమర్పించారు.
ఈసందర్భంగా డిప్యూటీ సీఎం వారి సందేహాలను నివృత్తి చేశారు. బాధితులకు మెరుగైన జీవన ప్రమాణాలు కల్పించడమే ప్రభుత్వ ధ్యేయమని, మూసీ ప్రాజెక్టులో భాగం కావాలని వారిని కోరారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ ప్రెసిడెంట్ శ్రీనివాస్‌రెడ్డి, సెక్రెటరీ శేఖర్, సభ్యులు సత్యనారాయణ, గౌతమ్ రాయ్, రేణుధల్, నబీ సాహెబ్, సాహిల్ ఖాన్ తదితరులు పాల్గొన్నారు.