సికింద్రాబాద్, జనవరి 1:
నూతన సంవత్సర వేడుకలు సికింద్రాబాద్, కంటోన్మెంట్ నియోజకవర్గాల్లోని ఆయా వార్డులతో పాటు పలు డివిజన్ల్లో ఆదివారం ఘనంగా నిర్వహించారు. వ్యాపార, ప్రైవేటు విద్యాసంస్థలు, చిరు వ్యాపారులు సైతం ఆయా షాపులు, బిల్డింగ్‌లను సర్వాంగ సుందరంగా అలంకరించుకున్నారు. గృహిణులు ఇండ్ల ముందు కొత్త సంవత్స రానికి స్వాగతం పలుకుతూ ఆకట్టుకునేలా రంగు రంగుల ముగ్గులు వేశారు. పిల్లలు, పెద్దలు కేక్‌లు కట్ చేసి నూతన సంవత్సర వేడుకలను జరుపుకున్నారు.
డిప్యూటీ స్పీకర్ పద్మారావుగౌడ్‌కు శుభాకాంక్షలు తెలిపేందుకు సీతాఫల్మండి డివిజన్లోని క్యాంపు కార్యాలయంలో అధికారులతో పాటు స్థానిక కార్పొరేటర్లు, పలువురు ప్రజాప్రతినిధులు డిప్యూటీ స్పీకర్‌కు పుష్పగుచ్ఛాలు అందజేసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు.New
ఎమ్మెల్యే కార్యాలయంలో…..
కార్ఖానాలోని కంటోన్మెంట్ ఎమ్మెల్యే సాయన్న క్యాంపు కార్యాలయంలో నూతన సంవత్సర వేడుకలు నిర్వహించారు. ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు, అభిమానులతో పాటు నియోజకవర్గ ప్రజలకు ఎమ్మెల్యే సాయన్న నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. ఎమ్మెల్యే సాయన్నను బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు పుష్పగుచ్ఛం అందించి, శాలువాతో సత్కరించి శుభాకాంక్షలు చెప్పారు. వీరితో పాటు ఆయా డివిజన్ల ఏసీపీలు, పోలీస్ స్టేషన్ల సర్కిల్ ఇన్స్పెక్టర్లు ఎమ్మెల్యేను కలిసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు.