కొండాపూర్, జూన్ 15 : శేరిలింగంపల్లి నియోజకవర్గంలోని కూరగాయల మార్కెట్లు, హోటళ్లు, వ్యాపార సముదాయాలు, ఫంక్షన్ హాళ్లలో ప్లాస్టిక్ విరివిగా వినియోగాన్ని అరికట్టాలంటూ మదర్ సేవ సమితి ట్రస్టు చైర్మన్ బద్దం కొండల్ రెడ్డి సోమవారం సీఎంసీ కమిషనర్ సృజనకు వినతి పత్రం అందజేశారు. ప్లాస్టిక్ వాడకంతో భూ కాలుష్యం, ప్లాస్టిక్ వ్యర్థాలను తిన్న మూగజీవాలు మృతి చెందుతున్నాయనీ ఆమె దృష్టికి తీసుకువచ్చారు.
నియోజకవర్గంలో ప్లాస్టిక్ అమ్మకాలు, వినియోగాన్ని అరికట్టేందుకు కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. దీంతో పాటుగా హుడా ఎంఎంటీఎస్ రైల్వే స్టేషన్ సమీపంలో నిర్మించిన కూరగాయల షెడ్లు నిరుపయోగంగా ఉన్నాయని, వాటిని పరిశీలించి వినియోగంలోకి తీసుకువచ్చి వ్యాపారులకు కేటాయించాలని విజ్ఞప్తి చేశారు.