ROB | సిటీబ్యూరో, నవంబర్ 30 ( నమస్తే తెలంగాణ): రూ. 20 కోట్లతో బేగంపేట ఆర్వోబీ(రైల్ ఓవర్ బిడ్జి)కి మరమ్మతులు చేపట్టేందుకు అనుమతి ఇస్తూ రాష్ట్ర పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి దానకిశోర్ శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. ఈ మేరకు తగిన చర్యలు తీసుకోవాల్సిందిగా బల్దియాను ఆదేశించారు. ఎస్ఎన్డీపీ మొదటి దశ పనుల్లో భాగంగా రూ. 2.99 కోట్లతో చేపట్టిన సరూర్నగర్ చెరువు అభివృద్ధి పనులకు సంబంధించి అలుగు నిర్మాణం, ఇతర మరమ్మతు పనులకు అనుమతినిచ్చారు.
అలాగే ప్రకటనల రుసుము నుంచి మినహాయింపునిస్తూ.. రెండు సంస్థలకు వేర్వేరు ప్రాంతాల్లో ఎల్ఈడీ బోర్డులను ఏర్పాటు చేసుకునేందుకు అనుమతి ఇచ్చారు. బేగంపేట విమానాశ్రయం రోడ్డుపై భారత వాతావరణ శాఖకు, రవీంద్రభారతిలో రాష్ట్ర, భాషా, సాంస్కృతిక శాఖలు డిజిటల్ బోర్డులను ఏర్పాటు చేసుకోవచ్చన్నారు.