కాచిగూడ కర్ణాటక సాహిత్యమందిర్ పునర్నిర్మాణానికి రూ. 5 కోట్లు మంజూరు చేయడాన్ని హర్షిస్తూ.. శనివారం సీఎం కేసీఆర్ చిత్రపటానికి వీర తిలకం దిద్ది..క్షీరాభిషేకం చేసి.. తమ అభిమానాన్ని చాటుకున్నారు మందిర్ ప్రతినిధులు.
కాచిగూడ, మార్చి 4 : కాచిగూడ కర్ణాటక సాహిత్య మందిర్ పునర్నిర్మాణానికి ముఖ్యమంత్రి కేసీఆర్ రూ.5 కోట్లు మంజూరు చేసినందుకు శనివారం కాచిగూడ కర్ణాటక సాహిత్య మందిర్ ప్రతినిధులు బర్కత్‌పుర లింగంపల్లిలోని కార్యాలయంలో సీఎం కేసీఆర్ చిత్ర పటానికి క్షీరాభిషేకం చేశారు. అనంతరం కర్ణాటక సాహిత్యమందిర్ అధ్యక్షుడు సురేంద్ర కటగేరి మాట్లాడుతూ కన్నడ ప్రజల సమస్యల పరిష్కారానికి ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్ ప్రత్యేక చొరవతో సీఎం కేసీఆర్ రూ.5 కోట్లు మంజూరు చేశారని అన్నారు. కన్నడ ప్రజలు సీఎం కేసీఆర్‌కు జీవితాంతం రుణపడి ఉంటారని అన్నారు.
ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకుడు దిడ్డి రాంబాబు, డివిజన్ అధ్యక్షుడు భీష్మాదేవ్, డాక్టర్ శిరీషాయాదవ్, ప్రధాన కార్యదర్శి సదానంద్, ఓం ప్రకాశ్‌యాదవ్, దాత్రిక్ నాగేందర్బాబ్జి, బి.కృష్టాగౌడ్, విజితారెడ్డి, నర్సింహ్మమూర్తి, ఫణిశ్రీ, పాండురంగ, లక్ష్మణ్, మహేందర్, మన్నె శ్రీనివాస్‌యాదవ్, శ్రీకాంత్‌యాదవ్, బబ్లూ, అంటోనీ,అనిల్, శేఖర్ తదితరులు పాల్గొన్నారు.