720 గ్రాములతో పుట్టిన శిశువు.. ప్రాణాలతో కాపాడిన వైద్యులు
hyderabad | ఓ గర్భిణి నెలలు నిండకముందే బిడ్డకు జన్మనిచ్చింది. అనేక సమస్యలతో పుట్టిన ఆ పసికందుకు రెండున్నర నెలల పాటు చికిత్స అందించి ప్రాణాలతో కాపాడారు. ఈ ఘటన హైదరాబాద్
హైదరాబాద్ : ఓ గర్భిణి నెలలు నిండకముందే బిడ్డకు జన్మనిచ్చింది. అనేక సమస్యలతో పుట్టిన ఆ పసికందుకు రెండున్నర నెలల పాటు చికిత్స అందించి ప్రాణాలతో కాపాడారు. ఈ ఘటన హైదరాబాద్ సనత్‌నగర్‌లోని రెనోవా ఆస్పత్రిలో వెలుగు చూసింది.
హైదరాబాద్ మోతీ నగర్‌కు చెందిన టీ భ్రమరాంబిక.. గర్భం దాల్చింది. అయితే ఏడు నెలలకే ఆమె ప్రసవించింది. పాప బరువు కేవలం 720 గ్రాములే. అంతేకాకుండా శ్వాసకోశ సంబంధ సమస్యతో పాటు రక్తపోటు తగ్గడం, గుండెకు రక్తప్రసరణ తగ్గడం, అప్నీయా, ఆహారం పడకపోవడం, కల్చర్ నెగిటివ్ ఇన్ఫెక్షన్ వంటి సమస్యలతో బాధపడుతోంది శిశువు. దీంతో రెనోవా ఆస్పత్రి వైద్యులు ఆ పాపకు రెండున్నర నెలల పాటు చికిత్స అందించి, ప్రాణాలతో కాపాడారు.
రెనోవా ఆసుపత్రికి చెందిన నియోనటాలజిస్ట్ డాక్టర్ సూర్యప్రకాశ్ హెడ్డా నేతృత్వంలో పీడియాట్రిషియన్లు డాక్టర్ రుఖియా, డాక్టర్ సీహెచ్ వేణుగోపాల్‌రెడ్డిలు శిశువుకు వైద్యం అందించారు. ఇటువంటి ఆరోగ్య సమస్యలతో పుట్టిన శిశువులు 70-80 శాతం మాత్రమే బతికేందుకు అవకాశాలు ఉంటాయన్నారు. తమ పాపను ప్రాణాలతో కాపాడిన రెనోవా ఆస్పత్రి వైద్యులకు భ్రమరాంభిక, ఆమె భర్త నరేశ్ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

