
సిటీబ్యూరో, జనవరి 9 (నమస్తేతెలంగాణ) : జీహెచ్ఎంసీ పరిధిలో ట్రేడ్ లైసెన్స్ దరఖాస్తుల స్వీకరణ, సర్టిఫికెట్ల జారీ ప్రక్రియను సులభతరం చేసేందుకు ఆన్‌లైన్‌లోకి తీసుకొచ్చారు. నూతన లైసెన్స్, ట్రేడ్ లైసెన్స్ రెన్యూవల్ చేసుకునే వ్యాపారస్తుల సౌకర్యార్థం ఈ కొత్త విధానం అందుబాటులోకి వచ్చింది. WWW. ghmc. gov.in లేదా మై జీహెచ్ఎంసీ యాప్‌ను సందర్శించి దరఖాస్తు లేదా రెన్యూవల్ చేసుకోవచ్చు. గ్రేటర్‌వ్యాప్తంగా అధికారికంగా దాదాపు 2 లక్షల ట్రేడ్ లైసెన్స్లుండగా అనధికారికంగా మరో లక్ష వరకు వ్యాపారస్తులు ఉన్నట్లు అధికారుల అంచనా.