మెహిదీపట్నం, జూలై 5 : ప్రజలకు దోమల బెడద లేకుండా జిహెచ్ఎంసి అధికారులు చర్యలు చేపట్టాలని కార్వాన్ నియోజకవర్గం జియాగూడ కార్పొరేటర్ బోయిని దర్శన్, బిజెపి పార్లమెంట్ కన్వీనర్ అల్వాల ఇంద్రసేనారెడ్డిలు జిహెచ్ఎంసి కమిషనర్ ఆర్వీ కర్ణన్‌ను కోరారు. ఈ మేరకు శనివారం జిహెచ్ఎంసి కమిషనర్‌ను ఆయన కార్యాలయంలో కలిసి లంగర్ హౌస్ చెరువులో గుర్రపు డెక్కను తొలగించడానికి వెంటనే చర్యలు చేపట్టాలని వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా జియాగూడ కార్పొరేటర్ దర్శన్ మాట్లాడుతూ.. జిహెచ్ఎంసి పారిశుద్ధ్య విభాగం, ఎంటమాలజీ విభాగం అధికారులు సరిగా పనిచేయడం లేదని ఫిర్యాదు చేశారు. దీంతో ప్రజలు దోమలు బెడదతో ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. గుర్రపు డెక్కను తొలగించాలని కోరారు.