హైదరాబాద్, ఫిబ్రవరి 16 (నమస్తే తెలంగాణ): దక్షిణాది న్యాయమూర్తుల ప్రాంతీయ సమావేశం మార్చి నెల 14,15 తేదీల్లో రెండు రోజులు పాటు హైదరాబాదులో జరుగనున్నది. తెలంగాణ హైకోర్టు ఆతిథ్యం ఇవ్వనున్న ఈ ప్రాంతీయ (సౌత్ జోన్ – 2) సమావేశాల నిర్వహణ కోసం తెలంగాణ ప్రభుత్వం రూ.2 కోట్లు విడుదల చేసింది. హైకోర్టు రిజిస్ట్రార్ జనరల్ రాసిన లేఖను పరిగణనలోకి తీసుకున్న ప్రభుత్వం సోమవారం ఈమేరకు జీవో విడుదల చేసింది. ఈ సమావేశాలకు తెలంగాణ, ఏపీ, కర్ణాటక, కేరళ, మద్రాసు హైకోర్టు న్యాయమూర్తులు హాజరుకానున్నారు.