మియాపూర్ ఫిబ్రవరి 13 : చందానగర్ సర్కిల్(Chandanagar )పరిధిలో ఫుట్పాత్ ఆక్రమణల తొలగింపు (Footpath encroachments) రెండో రోజు కొనసాగింది. ట్రాఫిక్ అంతరాయం కలగడంతో పాటు పాదచారులకు అసౌకర్యంగా మారడంతో ఫుట్పాత్ ఆక్రమణలను అధికారులు తొలగిస్తున్నారు. ఈ మేరకు మియాపూర్ మెట్రో స్టేషన్ నుంచి లింగంపల్లి వరకు ఇరువైపులా ఫుట్పాత్ పై ఏర్పాటు చేసిన చిరు వ్యాపారాలు ఇతర దుకాణాలను తొలగించారు.
ఫుట్పాత్ పై ఆక్రమణల తొలగింపు సందర్భంగా పేర్కొన్న చెత్త ఇతర వ్యర్థాలను ఎప్పటికప్పుడు తొలగిస్తున్నట్లు డీసీ మోహన్ రెడ్డి తెలిపారు. తొలగించిన ప్రాంతాల్లో మళ్లీ దుకాణాలు ఏర్పాటు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని డీసీ హెచ్చరించారు. శాంతి భద్రతలు, ట్రాఫిక్ పట్టణ ప్రణాళిక విభాగాల సంయుక్త ఆధ్వర్యంలో తొలగింపులను చేపడుతున్నట్లు ఆయన స్పష్టం చేశారు. స్పెషల్ డ్రైవ్ మరో వారం రోజులు పాటు కొనసాగుతుందన్నారు.