గూగుల్ మ్యాప్‌ను నమ్ముకుని అవుటర్‌పైకి వచ్చాం
గూగుల్ మ్యాప్‌ను నమ్ముకుని ద్విచక్ర వాహనాలు నిషేధిత అవుటర్‌పై ప్రయాణించిన ఇద్దరు యువకులను రాజేంద్రనగర్ ట్రాఫిక్ పోలీసులు అదుపులోకి తీసుకుని ఫైన్ విధించారు.ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ సిహెచ్ రాజు తెలిపిన వివరాల ప్రకారం.. ఈ నెల 11వ తేదిన తేజేశ్వర్రావు, శివరాజ్ అనే యువకులు కోత్వాల్గూడలోని ఎకో పార్కుకు వచ్చి హైటెక్ సిటీకి వెళ్లేందుకు గూగుల్ మ్యాప్ వేసుకున్నారు.
- క్షమించమని వేడుకున్న యువకులు
- చలాన్లు వేసి పంపించిన పోలీసులు
బండ్లగూడ, ఏప్రిల్ 14: గూగుల్ మ్యాప్‌ను నమ్ముకుని ద్విచక్ర వాహనాలు నిషేధిత అవుటర్‌పై ప్రయాణించిన ఇద్దరు యువకులను రాజేంద్రనగర్ ట్రాఫిక్ పోలీసులు అదుపులోకి తీసుకుని ఫైన్ విధించారు.ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ సిహెచ్ రాజు తెలిపిన వివరాల ప్రకారం.. ఈ నెల 11వ తేదిన తేజేశ్వర్రావు, శివరాజ్ అనే యువకులు కోత్వాల్గూడలోని ఎకో పార్కుకు వచ్చి హైటెక్ సిటీకి వెళ్లేందుకు గూగుల్ మ్యాప్ వేసుకున్నారు.
దానిని అనుసరించి ఇంటికి వెళ్తున్న సమయంలో అవుటర్ రింగ్‌రోడ్డు ఎగ్జిట్ నెంబర్ 17 వద్ద బారికేడ్లు లేకపోవడంతో వారు తమ ద్విచక్ర వాహనాలతో అవుటర్‌పై ప్రయాణించి గచ్చిబౌలికి వెళ్లారు. ఇది గమనించిన కొంతమంది అవుటర్‌పై వారు ప్రయాణిస్తున్న వాహనాల వీడియోలను సోషల్ మీడియలో పెట్టారు.
అవి వైరల్ కావడంతో చాలెంజ్‌గా తీసుకున్న రాజేంద్రనగర్ ట్రాఫిక్ పోలీసులు వారిని అదుపులోకి తీసుకుని పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. అక్కడ వారి నుంచి వివరాలు సేకరించగా, అవుటర్‌పై ద్విచక్ర వాహనాలకు నిషేధం ఉన్నట్లు తమకు తెలియదనడంతోపాటు తమను క్షమించాలని విజ్ఞప్తి చేశారు. దీంతో పోలీసుల వారికి చలాన్ వేసి మరోసారి ఇలాంటి చర్యలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించి వదిలేసినట్లు ఇన్స్పెక్టర్ రాజు తెలిపారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Milan protest | ఇటలీలో భారీ నిరసనలు.. స్టోర్ల లూటీ.. తగలబడ్డ రాజధాని మిలన్.. ఖండించిన జార్జియా మెలోని
Spirit New Poster | ప్రభాస్ ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్.. ‘స్పిరిట్’ నుంచి కొత్త పోస్టర్, రిలీజ్ డేట్ వచ్చేసింది
Greater Noida | టీ, నూడుల్స్ కారణం కాదు.. ఆ కుటుంబం ఆత్మహత్య చేసుకుంది..!
Bigg Boss 10 | బిగ్‌బాస్ తెలుగు 10లో ఊహించని ట్విస్ట్.. ఈ వారం నో ఎలిమినేషన్,సీక్రెట్ రూమ్‌లోకి షాలిని!
Kolkata Stampede | ‘తొక్కిసలాట ఎలా జరిగింది’.. బాధితులను పరామర్శించిన కేంద్ర హోంమంత్రి, బెంగాల్ సీఎం.. Video
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

