ఉస్మానియా యూనివర్సిటీ, డిసెంబర్ 18: ఉస్మానియా యూనివర్సిటీ(Osmania University) పరిధిలోని వివిధ విదేశీ భాషల(Foreign Languages) పీజీ డిప్లొమా కోర్సుల పరీక్షా ఫలితాలను(Examination Results) విడుదల చేసినట్లు కంట్రోలర్ ఆఫ్ ది ఎగ్జామినేషన్స్ ప్రొఫెసర్ రాములు ఒక ప్రకటనలో తెలిపారు. ఫ్రెంచ్, జర్మన్ భాషల పీజీ డిప్లొమా కోర్సుల పరీక్షలను గత నెలలో నిర్వహించామని, ఆ పరీక్షల ఫలితాలను విడుదల చేశామని చెప్పారు. ఈ ఫలితాలను ఓయూ వెబ్సైట్ www.osmania.ac.inలో చూసుకోవచ్చని సూచించారు.