భూ భారతి దరఖాస్తుల తిరస్కరణ
భూ భారతిలో వివిధ సమస్యలపై రైతులు చేసుకున్న దరఖాస్తులపై రైతులకు సమచారం లేకుండా తహసీల్దార్లు తిరస్కరిస్తున్నట్లు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మేడ్చల్ జిల్లా వ్యాప్తంగా సమస్యలపై సుమారు 15,201 మంది దరఖాస్తు చేసుకుంటే 8వేల పైచిలుకు దరఖాస్తులు రైతుల భూముల వద్దకు వెళ్లకుండానే తిరస్కరణకు గురైనట్లు సమాచారం.
మేడ్చల్, అక్టోబర్ 26 (నమస్తే తెలంగాణ): భూ భారతిలో వివిధ సమస్యలపై రైతులు చేసుకున్న దరఖాస్తులపై రైతులకు సమచారం లేకుండా తహసీల్దార్లు తిరస్కరిస్తున్నట్లు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మేడ్చల్ జిల్లా వ్యాప్తంగా సమస్యలపై సుమారు 15,201 మంది దరఖాస్తు చేసుకుంటే 8వేల పైచిలుకు దరఖాస్తులు రైతుల భూముల వద్దకు వెళ్లకుండానే తిరస్కరణకు గురైనట్లు సమాచారం. రెవెన్యూ సదస్సులు, మీసేవా కేంద్రాల ద్వారా భూభారతి పోర్టల్‌లో.. సక్సెషన్, మ్యుటేషన్, పీవోబీ, 22ఏ నిషేధిత జాబితా, కొత్త పాస్‌బుక్‌లు తదితర వాటికి సంబంధించి రైతులు పెద్ద ఎత్తున దరఖాస్తు చేసుకున్నారు.
మెజార్టీ దరఖాస్తులను తిరస్కరించడంతో రైతులు అయోమయానికి గురవుతున్నారు. భూ సమస్యలకు సంబంధించి దరఖాస్తుదారు వివరణ తీసుకోకుండా భూ భారతి పోర్టల్‌లో తిరస్కరించినట్లు చూపించడంపై రైతులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇదేవిషయమై జిల్లా కలెక్టరేట్లో సోమవారం నిర్వహించిన ప్రజావాణిలో జిల్లా రైతు సమాఖ్య అధ్యక్షుడు సంజీవరెడ్డి రైతుల తరఫున ఫిర్యాదు చేశారు. స్థానిక తహసీల్దార్లు సరైన కారణం చెప్పకుండానే అనేక దరఖాస్తులను నిరాకరిస్తున్నారని, వాటిని నిరాకరించే ముందు 7 రోజుల గడువును ఇచ్చి భూ సమస్యలకు సంబంధించి కావాల్సిన డ్యాకుమెంట్లు ఇచ్చేందుకు అవకాశం కల్పించాలని కోరారు. అలాగే దరఖాస్తులను ఎందుకు తిరస్కరించారో తహసీల్దార్లు వెల్లడించాలని రైతులు కోరుతున్నారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు

