Metro Rail | హైదరాబాద్ : ఏప్రిల్ 1వ తేదీ నుంచి మెట్రో రైలు( Metro Rail ) ప్రయాణ రాయితీల్లో కోత విధించనున్నారు. ఇప్పటి వరకు ఇస్తున్న డిస్కౌంట్‌ను రద్దీ వేళల్లో ఎత్తివేస్తున్నట్లు మెట్రో అధికారులు( Metro Officials ) ప్రకటించారు. సూపర్ సేవర్ హాలిడే కార్డ్( Super Saver Holiday card ) రీఛార్జ్‌ను అధికారులు పెంచారు. మెట్రో కార్డు( Metro Card )పై ఇప్పటి వరకు ఇస్తున్న 10 శాతం రాయితీపై కూడా షరతులు విధించారు. ఉదయం 8 నుంచి రాత్రి 8 గంటల వరకు 10 శాతం రాయితీ ఎత్తివేశారు.