ఉస్మానియా యూనివర్సిటీ, మార్చి 31: ఉస్మానియా యూనివర్సిటీ బీఈడీ కళాశాలలో రెడ్ రిబ్బన్ ర్యాలీని గురువారం నిర్వహించారు. కళాశాల ఎన్ఎస్ఎస్ యూనిట్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ ర్యాలీలో విద్యార్థులకు ఎయిడ్స్ వ్యాధి నివారణ, రక్తదానం ఆవశ్యకతలకు గురించి అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్ ప్రొఫెసర్ రవీంద్రనాథ్ కె. మూర్తి, ఇతర అధ్యాపకులు, ఎన్ఎస్ఎస్ వలంటీర్లు పాల్గొన్నారు.