సిటీబ్యూరో, అక్టోబర్ 13(నమస్తే తెలంగాణ): సిటీ పోలీస్ ఈస్ట్‌జోన్ పరిధిలో చోరీకి గురైన రూ.25లక్షల విలువైన 100 మొబైల్స్‌ను సోమవారం అంబర్‌పేటలోని కార్యాలయంలో ఈస్ట్‌జోన్ డీసీసీ బాలస్వామి ఆధ్వర్యంలో యజమానులకు అందజేశారు.
జోన్ పోలీసులు చేపట్టిన స్పెషల్‌డ్రైవ్‌లో సీఈఐఆర్, సాంకేతిక సహకారంతో రికవరీ చేసిన మొబైల్స్‌ను ఐఎంఈఐ నెంబర్ నిర్ధారించుకుని అందజేసినట్లు డీసీపీ బాలస్వామి పేర్కొన్నారు.