సిటీబ్యూరో, డిసెంబర్ 16 (నమస్తే తెలంగాణ): గ్రేటర్లో ఉష్ణోగ్రతలు రికార్డు స్థాయిలో పడిపోతుండడంతో చలి పులి నగరాన్ని గజ గజ వణికిస్తోంది. సోమవారం ఉదయం నుంచి రాత్రి వరకు నగరంలో గరిష్ఠ ఉష్ణోగ్రతలు 29.3 డిగ్రీలు నమోదవ్వగా, రాజేంద్రనగర్లో కనిష్ఠం ఉష్ణోగ్రతలు అత్యల్పంగా 8.5 డిగ్రీలు, నగరంలో 11.4 డిగ్రీలు, హకీంపేటలో 11.6 డిగ్రీలు, దుండిగల్లో 11.9 డిగ్రీలు, గాలిలో తేమ 33 శాతంగా నమోదైనట్లు అధికారులు వెల్లడించారు. ఉష్ణోగ్రతలు సాధారణ స్థాయి కంటే తక్కువకు పడిపోతుండడంతో రానున్న రోజుల్లో చలి తీవ్రత మరింత పెరిగే అవకాశాలున్నట్లు అధికారులు వెల్లడించారు.