Ration Rice | బొల్లారం,జూన్ 29 : అక్రమంగా రేషన్ బియ్యం తరలిస్తున్న ఓ వ్యక్తిని ఆదివారం ఎస్ఓటీ పోలీసులు పట్టుకొని బోయిన్పల్లి పోలీస్ స్టేషన్కు తరలించారు. ఈ ఘటన బోయిన్పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఓల్డ్ బోయిన్పల్లి హస్మత్ పేటకు చెందిన లక్ష్మణ్ సింగ్(42) ఆదివారం బోయిన్పల్లి సమీపంలోని డైరీ ఫాం రోడ్డులో పీడీఎస్ బియ్యాన్ని కొనుగోలు చేసి తీసుకెళ్తున్నాడన్న విశ్వసనీయ సమాచారం మేరకు టాస్క్ ఫోర్స్ పోలీసులు రేషన్ బియ్యాన్ని (సుమారు 2 టన్నుల బరువు )బియ్యాన్ని, మహీంద్రా బొలెరో వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఈ మేరకు పోలీసులు నిందితుడిని బోయిన్ పల్లి పోలీసులకు అప్పగించారు.