రంగారెడ్డి, నవంబర్ 12(నమస్తే తెలంగాణ): హైదరాబాద్ నగర శివారు (రంగారెడ్డి జిల్లా)లో కొ త్తగా మరో మూడు మున్సిపాలిటీలు ఏర్పాటు కానున్నాయి. జిల్లా పరిధిలోని మేజర్ గ్రామ పంచాయతీలైన కందుకూరు, మహేశ్వరం, చేవెళ్లలను మున్సిపాలిటీలుగా మార్చాలని ప్రభుత్వం ఇప్పటికే నిర్ణయించింది. ఈ మేరకు జిల్లా పంచాయతీ అధికారు లు ఆయా మేజర్ గ్రామ పంచాయతీల పూర్తి వివరాలను క్రోడీకరించి మున్సిపాలిటీలుగా మార్చటానికి కావాల్సిన అన్ని ఏర్పాట్లను చేసి ప్రభుత్వానికి నివేదికను పంపించారు.
దీంతో ప్రస్తుతం రంగారెడ్డి జిల్లాలో ఉన్న 13 మున్సిపాలిటీలకు తోడుగా మరో మూడు మున్సిపాలిటీలు రానుండటంతో జిల్లాలో మున్సిపాలిటీల సంఖ్య 16కు చేరనుంది. హైదరాబా ద్ శివారులల్లోని రంగారెడ్డి జిల్లాలో శరవేగంగా అభివృద్ధి చెందుతున్న కందుకూరు, మహేశ్వరం, చేవెళ్లలను కూడా మున్సిపాలిటీలుగా మార్చి తే ఈ ప్రాం తాలు మరింత అభివృద్ధి చెందే అవకాశాలున్నాయని ప్రభుత్వం భావించింది. అందులో భాగంగానే నగరానికి అత్యంత చేరువలో ఉన్న మహేశ్వరం నియోజకవర్గంలోని కందుకూరు, మ హేశ్వరంలు మున్సిపాలిటీలుగా రూపాంతరం చెందనున్నాయి. అలాగే, చేవెళ్ల నియోజకవర్గంలోని చేవెళ్ల హెడ్ క్వార్టర్స్ కూ డా మున్సిపాలిటీలుగా మారనున్నాయి.
మహేశ్వరం గ్రామ పంచాయతీ చుట్టు ప్రక్కల ఉన్న మహేశ్వరం, తుమ్మలూరు, సిగిరిపురం, గంగారం, ఉప్పు గడ్డ తండా, కేసీ తండా, మోహబత్ నగర్, ఎండి తండా, మన్సాన్పల్లి, గట్టుపల్లి, ఆకన్పల్లి, రాంచంద్ర గూడ తదితర గ్రామాలను కలుపుతూ మహేశ్వరం మున్సిపాలిటీగా మార్చనున్నారు.
కందుకూరు గ్రామ పంచాయతీ చుట్టు ప్రక్కల ఉన్న కందుకూరు, కొత్తగూడం, కొత్తూరు, గూడూరు, బైరాగిగూడ, నేదునూరు, దెబ్బడగూడ, ఆకుల మైలా రం, మీర్ఖాన్పేట్, బేగరి కంచె, అన్నోజిగూడ, రాచులూరు, తిమ్మాపూర్, గుమ్మడవెల్లి, కటికపల్లి, జైత్వా రం గ్రామాలను కలుపుతూ కందుకూరు మున్సిపాలిటీగా మార్చే ఏర్పాటు చేస్తున్నారు. అత్యధికంగా కం దుకూరు మున్సిపాలిటీ పరిధిలోకి 16 గ్రామ పంచాయతీలు రానున్నాయి. ప్రధానంగా ఇటీవల రాష్ట్ర ప్ర భుత్వం కందుకూరు మండలంలో ఏర్పాటు చేస్తున్న ఫ్యూచర్ సిటీని దృష్టిలో ఉంచుకుని మీర్ఖాన్పేట్, ఆకుల మైలారం, బేగరి కంచె గ్రామాలను కందుకూ రు గ్రామ పంచాయతీలో కలుపుతూ మున్సిపాలిటీగా మార్చే యోచనలో ఉంది. ప్రధానంగా రంగారెడ్డి జి ల్లాలోని నగర శివారు ప్రాంతాల్లో ఉన్న గ్రామాలను కలుపుతూ, మున్సిపాలిటీలుగా ఏర్పాటు చేయటానికి ప్రభుత్వం వడివడిగా అడుగులు వేస్తోంది.
ప్రస్తుతం రంగారెడ్డి జిల్లాలో 13 మున్సిపాలిటీలు, 3 కార్పొరేషన్లున్నాయి. వీటికి తోడు కొత్తగా మరో మూడు మున్సిపాలిటీలు ఏర్పాటవుతుండటంతో జిల్లాలో మున్సిపాలిటీల సంఖ్య 16కు చేరనుంది.