హైదరాబాద్ : ఆకాశవాణి(Akashavani )90 సంవత్సరాల ప్రజా సేవ ప్రసారోత్సవాల సందర్భంగా హైదరాబాద్ కేంద్రం ఆధ్వర్యంలో ‘గగన విజయం విశేష అష్టావధానం’ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని హైదరాబాద్ కేంద్రం డైరెక్టర్ రమేష్ సుంకసారి ఒక ప్రకటలో తెలిపారు. ఆదివారం( జూన్ 07) ఉదయం 9:30 గంటలకు నాంపల్లిలోని సురవరం ప్రతాపరెడ్డి తెలుగు విశ్వ విద్యాయం వేదికగా నిర్వహిస్తామన్నారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రిటైర్డ్ ఐఏఎస్ అధికారి, తెలంగాణ రాష్ట్ర పూర్వ సలహాదారు కేవీ రమణా చారి, విశిష్ట అతిథిగా తెలంగాణ రాష్ట్ర భాషా, సాంస్కృతిక శాఖ సంచాలకులు, ఐఏఎస్ అధికారి, డా. ఏనుగు నరసింహా రెడ్డి, అవధాని నల్లాన్ చక్రవర్తుల సాహిత్ హాజరవుతారన్నారు. ఈ కార్యక్రమాన్ని శ్రోతలు విజయవంతం చేయాలని రమేష్ సుంకసారి కోరారు.