హైదరాబాద్, జూన్ 12 (నమస్తే తెలంగాణ): లంబాడి ఆడబిడ్డ కనుకనే సింగర్ మంగ్లీని ఇరికించే కుట్ర జరుగుతున్నదని.. మహిళలున్న గదిలో, బెడ్ రూంలలో, బాత్ రూంలలోకి వెళ్లి వీడియోలు తీసిన వారిపై తక్షణమే ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని లంబాడి హక్కుల పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షుడు మూడావత్ రాంబల్ నాయక్ డిమాండ్ చేశారు. కొంతమంది కుటుంబ సభ్యుల మధ్య బర్త్ డే వేడుకలు జరుపుకుంటుంటే కొంతమందికి పాజిటివ్ వచ్చింది అని భయభ్రాంతులకు గురిచేస్తారా అని ప్రశ్నించారు.
గిరిజన అమ్మాయిలు అంటే రాష్ట్ర ప్రభుత్వానికి ఇంత చిన్న చూపా? తక్షణమే ఆ వీడియోలు అన్ని డిలీట్ చేయాలని డిమాండ్ చేశారు. వీడియో స్టాప్ చేస్తావా చేయవా అని మంగ్లీ అంటే..పోలీసులపై ఆమె దాష్టికం ప్రదర్శించింది.. చిందులేసింది అని కొన్ని చానల్స్ వార్తా ప్రసారాలు చేయడం సరికాదన్నారు.