మేడ్చల్, ఏప్రిల్ 6(నమస్తే తెలంగాణ): నిరుద్యోగ యువతీ యువకులకు స్వయం ఉపాధి కల్పించేలా ప్రభుత్వం ప్రవేశపెట్టిన రాజీవ్ యువ వికాసం పథకానికి దరఖాస్తులు చేసుకోవాలంటే రూ. 2 లక్షలకు మించి ఆదాయం మించి ఉండరాదు.
దీంతో తెల్ల రేషన్ కార్డులు లేని వారికి ఆదాయ ధ్రువీకరణ పత్రం పొందేందుకు అనేక ఇబ్బందులు ఏర్పడుతున్నాయి. జిల్లాలో ఇప్పటి వరకు రాజీవ్ యువ వికాసం పథకానికి 29,901 దరఖాస్తులు వచ్చాయి. ఇప్పటి వరకు అర్హులకు రేషన్ కార్డులు అందకపోవడంతో రాజీవ్ యువ వికాసం పథకాలు పొందాలంటే ఇబ్బందికరంగా మారుతున్నది.