హైదరాబాద్ : హైదరాబాద్ నగరంలో వాతావరణం చల్లబడింది. ఉదయం నుంచి ఉక్కపోతకు గురవుతున్న ప్రజలకు కాస్త ఉపశమనం లభించింది. రాబోయే అర గంటలో నగరంలోని పలు ప్రాంతాల్లో చిరు జల్లులు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. కూకట్పల్లి, బాలానగర్, బోయిన్పల్లి, కుత్బుల్లాపూర్, జగద్గిరిగుట్టతో పాటు ఆ పరిసర ప్రాంతాల్లో వర్షం కురిసే అవకాశం ఉందని తెలిపింది. గత నాలుగైదు రోజుల నుంచి ఎండలు దంచికొడుతున్న సంగతి తెలిసిందే. అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి.
ఇక రాష్ట్ర వ్యాప్తంగా పరిశీలిస్తే.. ఆదిలాబాద్, ఆసిఫాబాద్, నిర్మల్, కామారెడ్డి, సిరిసిల్ల, సంగారెడ్డి, రంగారెడ్డి జిల్లాల్లో రాబోయే 2 గంటల్లో ఉరుములతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. మరోవైపు రాష్ట్ర వ్యాప్తంగా అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. 45 డిగ్రీల సెల్సియస్ దాకా ఉష్ణోగ్రతలు చేరాయి.
Scattered showers likely in Kukatpally, Balanagar, Bowenpally, Qutbullapur, Jagathgirigutta and nearby areas in next 30minutes
— Telangana Weatherman (@balaji25_t) April 28, 2022