Rains | హైదరాబాద్ : గత నాలుగైదు రోజుల నుంచి హైదరాబాద్ నగరంలో ఎండలు దంచికొడుతున్న సంగతి తెలిసిందే. కానీ శుక్రవారం మధ్యాహ్నం ఒక్కసారిగా వాతావరణం చల్లబడింది. నగరంలోని పలు ప్రాంతాల్లో వర్షం కురిసింది. దీంతో ఉక్కపోత నుంచి ఉపశమనం కలిగింది. పాతబస్తీ, రాయదుర్గం, మాదాపూర్, గచ్చిబౌలి, కొత్తపేట్, సరూర్నగర్, చంపాపేట్, సైదాబాద్, మాదన్నపేట్, మలక్పేట్, చాదర్ఘాట్, ఎల్బీనగర్ ఏరియాల్లో వర్షం కురిసింది. ఇక రాబోయే 12 నుంచి 18 గంటల్లో హైదరాబాద్ వ్యాప్తంగా మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.
ఇక ఉపరితల ఆవర్తనం ప్రభావంతో రాష్ట్రంలో రాగల మూడు రోజుల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఆదిలాబాద్, ఆసిఫాబాద్, నిర్మల్, మంచిర్యాల, పెద్దపల్లి, భూపాలపల్లి జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణం కేంద్రం వెల్లడించింది. వర్షాలు కురిసే సమయంలో గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉంది.
Biodiversity Junction. pic.twitter.com/c84xfNlyzF
— Sathwik Adi (@AdiSathwik) June 21, 2024