Hyderabad | హైదరాబాద్ : హైదరాబాద్ నగరంలో ఉదయం నుంచి ఎండ దంచికొట్టింది. ఇక సాయంత్రం సమయానికి కాస్త వాతావరణం చల్లబడింది. రాత్రి 7 గంటల సమయంలో భారీ ఉరుములతో కూడిన వర్షం కురిసింది. ఈదురుగాలులు కూడా వీచడంతో పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాకు అంతరాయం కలిగింది.
చార్మినార్, బహదూర్‌పురా, ఫలక్‌నుమా, చాంద్రాయణగుట్ట, బార్కస్, శాలిబండ, సుల్తాన్ బజార్, నాంపల్లి, అబిడ్స్, బషీర్‌బాగ్, లిబర్టీ, నారాయణగూడ, హిమాయత్‌నగర్, కూకట్పల్లి, ప్రగతినగర్, బాచుపల్లి, జగద్గిరిగుట్ట, రాజేంద్రనగర్, బండ్లగూడ జాగీర్తో పాటు పలు ప్రాంతాల్లో వర్షం కురిసింది. పలు ప్రాంతాల్లో ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది.
Lightning and Drizzling in and around Charminar pic.twitter.com/sKHc3bXWJp
— Shakeel Yasar Ullah (@yasarullah) May 1, 2025