HYD Rains | హైదరాబాద్ నగరంలోని పలుచోట్ల వర్షం కురుస్తున్నది. కూకట్పల్లి, ఆల్విన్ కాలనీ, నిజాంపేట, కేపీహెచ్‌బీ కాలనీ, ప్రగతినగర్, బాచుపల్లి, కొంపల్లి, కుత్బుల్లాపూర్, అల్వాల్, నేరెడ్మెట్, గచ్చిబౌలి, మియాపూర్, ఖాజాగూడ, బంజారాహిల్స్‌లో వర్షం పడుతున్నది. అలాగే. సంగారెడ్డి జిల్లా పటాన్చెరు, వికారాబాద్ జిల్లా తాండూరుతో పాటు బహదూర్‌పల్లి, సూరారం, గుండ్లపల్లి పోచంపల్లి, సుచిత్ర, కొంపల్లి, జీడిమెట్ల, బాలానగర్, మేడ్చల్, కృష్ణాపూర్, గండిమైసమ్మ, మల్లంపేట్, దుండిగల్‌లోనూ వర్షం కురిసింది. ఒక్కసారిగా కురిసిన వర్షానికి వాహనదారులు ఇబ్బందులకు గురయ్యారు. ఇదిలా ఉండగా.. హైదరాబాద్‌లో ఆకాశం సాధారణంగా మేఘావృతమై ఉంటుందని.. నగరంలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. పలుచోట్ల ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు పడుతాయని పేర్కొంది. తూర్పు, ఆగ్నేయ దిశలో గాలులు వీచే అవకాశం ఉందని తెలిపింది.